Oseltamivir Drug : వైరస్ టెన్షన్.. ఈ మందును వాడాలని కేంద్రం సూచన
హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

Oseltamivir Drug : హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత కొన్నిరోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి అధికమైంది. అంతేకాదు, ఇప్పటికే రెండు మరణాలూ సంభవించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్ బారిన పడితే వాడాల్సిన మందు ఏంటో చెప్పింది.
దేశంలో ఇన్ ఫ్లూయెంజా A ఉపరకం H3N2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. వైరస్ సోకితే డబ్ల్యూహెచ్ఓ సూచించిన ‘ఒసెల్టామివిర్’ డ్రగ్ వాడాలని సూచించింది. ప్రజా వైద్యశాలల్లో ఈ మందు ఉచితంగా లభిస్తుందని తెలిపింది. ఇక, వైరస్ బారిన పడితే అవనసర యాంటీ బయోటిక్స్ వాడొద్దని కోరింది. ఈ వైరస్ తో ఇప్పటికే దేశంలో రెండు మరణాలు(కర్నాటక, హర్యానా) నమోదవడం ఆందోళకు గురి చేసే అంశం.
Also Read..H3N2 virus : దేశంలో భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలేంటో తెలుసా?
హెచ్3ఎన్2.. ఇన్ ఫ్లుయెంజా వైరస్ సబ్ వేరియంట్ అని కేంద్రం వెల్లడించింది. పిల్లలు, అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధులు ఈ హెచ్3ఎన్3 వైరస్ కు త్వరగా గురవుతారని వెల్లడించింది.
ఈ వైరస్ భారత్ కు కొత్తకాదని, దేశంలో ప్రతి ఏటా రెండు పర్యాయాలు దీని వ్యాప్తి కనిపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వివరించింది. కొన్నిసార్లు వైరస్ వ్యాప్తి వేగం అధికంగా ఉన్నప్పటికీ, మార్చి చివరి కల్లా హెచ్3ఎన్2 కేసులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంది.
కాగా..హెచ్3ఎన్2 వైరస్ కారణంగా వచ్చిన ఇన్‌ఫ్లూయంజాతో ఇద్దరు వ్యక్తులు మరణించారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఒకరు హర్యానాలో, మరొకరు కర్ణాటకలో మరణించారు. కర్ణాటకలోని హసన్‌కి చెందిన 82ఏళ్ళ వృద్ధుడు దేశంలోనే మొదటిసారిగా ఈ వైరస్‌తో మరణించినట్లు భావిస్తున్నారు. ఫిబ్రవరి 24న హిరే గౌడను ఆస్పత్రిలో చేర్చారు. మార్చి 1న మరణించారని అధికారులు తెలిపారు.
ఆయన మధుమేహం, బిపితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, హర్యానాకి చెందిన 56ఏళ్ళ వ్యక్తిని ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న రోగిగా గుర్తించారు. జనవరిలో ఆయనకు హెచ్3ఎన్2 పాజిటివ్‌గా తేలింది. జింద్‌లోని ఆయన నివాసంలో బుధవారం మరణించినట్లు వార్తలందాయి. దేశంలో మొత్తంగా ఈ వైరస్‌కి సంబంధించి 90కేసులు నమోదయ్యాయి. హెచ్1ఎన్1 వైరస్‌కి సంబంధించి 8 కేసులను కూడా గుర్తించారు. హెచ్3ఎన్2 వైరస్ ను హాంకాంగ్ ఫ్లూ గా కూడా పిలుస్తున్నారు. చిన్న పిల్లలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు ఎక్కువగా ఈ సీజనల్ ఇన్‌ఫ్లూయంజాకు గురయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.