ఢిల్లీలో వడగళ్ళ వాన..భారీగా నిలిచిపోయిన నీరు

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 11:13 AM IST
ఢిల్లీలో వడగళ్ళ వాన..భారీగా నిలిచిపోయిన నీరు

దేశ రాజధాని ఢిల్లీలోని ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం (మార్చి 14,2020)వడగళ్ళ వాన కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమై, మధ్యాహ్నం పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.   

వర్షపాతం సంభవించిన తరువాత ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సమీపంలో నీరు భారీగా నిలిచిపోయింది. ఈ కాలంలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత కన్నా కాస్త ఎక్కువగా శనివారం 16.4 డిగ్రీల సెల్సియస్ శనివారం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉదయం 8.30 గంటలకు  తేమ శాతం 88 శాతంగా నమోదైందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉందని..గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉండవచ్చునని  తెలిపింది. వచ్చేవారం ఉష్ణోగ్రతలు పెరుగతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

See Also |  స్కూళ్లు, కాలేజీలు మూసేసినా.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు