మీరట్ నుంచి తలారీ,బీహార్ నుంచి ఉరితాళ్లు…22ఉదయం నిర్భయ దోషులకు ఉరి

  • Published By: venkaiahnaidu ,Published On : January 7, 2020 / 03:40 PM IST
మీరట్ నుంచి తలారీ,బీహార్ నుంచి ఉరితాళ్లు…22ఉదయం నిర్భయ దోషులకు ఉరి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ ఇవాళ(జనవరి-7,2020)పటియాలా కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు జనవరి-22 ఉదయం 7గంటలకు దోషులను ఉరి తీయాలని కోర్టు తీర్పు నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు అందుకు అనుగుణంగా ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

డిసెంబర్ 14లోగా 10 పీసుల ఉరితాళ్లను సిద్దం చేయాలని బీహార్ లోని బక్సర్ జైలుకు గతంలో ఆదేశాలు అందాయి. ఉరితీయడానికి ఉపయోగించే రోప్ లను తయారుచేయడంలో పేరుపొందిన బక్సర్ జైలుకు ప్రిజన్ డైరక్టరేట్ ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉరితాళ్లు నిర్భయ కేసులోని దోషుల కోసమే అని తెలుస్తోంది. పార్లమెంట్ పై దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురుని ఉరి తీయడానికి ఉపయోగించిన తాడుని ఈ జైలు నుంచే పంపించిన విషయం తెలిసిందే.

మీరట్ చెందిన ఓ వ్యక్తి నిర్భయ దోషులను జైలులో ఉరితీసే బాధ్యతను చేపట్టనట్లు తెలుస్తోంది. నలుగురు దోషులను ఒకే సమయంలో ఒకేసారి కలిసి ఉరితీయడానికి జైలు దగ్గర సరైన ఏర్పాట్లు ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని జైలు అధికారి ఒకరు తెలిపారు. ఆసియాలో అతిపెద్ద జైలు అయిన తీహార్ జైలులో ఉరి పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్ష కూడా జరిగిందని తెలిపారు. దోషులను వేర్వేరు సెల్స్ లో ఉంచి, సిసిటివి ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3 లో ఉరి తీయడానికి ఏర్పాట్లు సిద్దమ్యాయి.

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.