Holi 2023: హోలీ శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా, రాహుల్ గాంధీ, రాజకీయ ప్రముఖులు
హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకోగా.. బుధవారంసైతం పలు ప్రాంతాల్లో హోలీ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Holi 2023
Holi 2023: హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకోగా.. బుధవారంసైతం పలు ప్రాంతాల్లో హోలీ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారు జామునుంచే చిన్నారుల నుంచి పెద్దల వరకు రోడ్లపైకి వచ్చి ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువతీయువకులు రంగుల కేళిలో మునిగిపోయారు. హోలీ పర్వదినం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలుతెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తోపాటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
रंग, उमंग, हर्ष और उल्लास के त्योहार होली की समस्त देशवासियों को हार्दिक शुभकामनाएं।
खुशियों का यह त्योहार आप सभी के जीवन में नई ऊर्जा का संचार करे। pic.twitter.com/c5rlh0CRAt
— Amit Shah (@AmitShah) March 8, 2023
అమిత్ షా హోలీ శుభాకాంక్షలు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగులు ఉత్సాహం, ఆనందం, ఉల్లాసానికి సంబంధించిన పండుగ హోలీ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభకాంక్షలు అని హిందీలో ట్వీట్ చేశారు. సంతోషకరమైన పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లో కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు.
होली का त्योहार सबके जीवन में नए रंग भरे, देश पर एकता का रंग चढ़े।
Wishing a very Happy Holi to everyone! pic.twitter.com/3v0mfpGVAR
— Rahul Gandhi (@RahulGandhi) March 8, 2023
రాహుల్ గాంధీ హోలీ శుభాకాంక్షలు ..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకూడా దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలుతెలిపారు. హోలీ పండుగ ప్రతీఒక్కరి జీవితాల్లో కొత్త రంగులను నింపుతుందని, దేశంలో ఐక్యత వర్ణాన్ని ప్రకాశింపజేస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
होली के पर्व पर आप सभी को हार्दिक बधाई और शुभकामनाएँ। हर्ष, उल्लास और सौहार्द का प्रतीक, यह त्योहार आपके जीवन में सफलता, प्रसन्नता और उत्तम स्वास्थ्य के नए-नए रंग भरे, यही मंगलकामना है। pic.twitter.com/YALEHem1gK
— Rajnath Singh (@rajnathsingh) March 8, 2023