Holi 2023: హోలీ శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా, రాహుల్ గాంధీ, రాజకీయ ప్రముఖులు

హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకోగా.. బుధవారంసైతం పలు ప్రాంతాల్లో హోలీ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Holi 2023: హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకోగా.. బుధవారంసైతం పలు ప్రాంతాల్లో హోలీ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారు జామునుంచే చిన్నారుల నుంచి పెద్దల వరకు రోడ్లపైకి వచ్చి ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువతీయువకులు రంగుల కేళిలో మునిగిపోయారు. హోలీ పర్వదినం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలుతెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తోపాటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

 

అమిత్ షా హోలీ శుభాకాంక్షలు..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగులు ఉత్సాహం, ఆనందం, ఉల్లాసానికి సంబంధించిన పండుగ హోలీ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభకాంక్షలు అని హిందీలో ట్వీట్ చేశారు. సంతోషకరమైన పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లో కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు.

 

రాహుల్ గాంధీ హోలీ శుభాకాంక్షలు ..

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకూడా దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలుతెలిపారు. హోలీ పండుగ ప్రతీఒక్కరి జీవితాల్లో కొత్త రంగులను నింపుతుందని, దేశంలో ఐక్యత వర్ణాన్ని ప్రకాశింపజేస్తుందని ఆయన ట్వీట్ చేశారు.

 

 

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. 
హొలీ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, ఉల్లాసం, సామరస్యానికి చిహ్నం ఈ పండుగ అని, హోలీ మీ జీవితాలు ఆనందమయంగా ఉండేలా చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు