హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు ? 

  • Published By: madhu ,Published On : April 2, 2019 / 07:44 AM IST
హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు ? 

హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసును అత్యవసరంగా విచారించండి..అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం పై విధంగా వ్యాఖ్యానించింది. హార్థిక్ పటేల్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు.
Read Also : జగన్‌కు బిస్కెట్లు వేస్తే కుక్కలా విశ్వాసం చూపుతున్నాడు

అయితే ఇక్కడే కొన్ని సమస్యలు ఎదురయ్యాయి పటేల్ కు. 2015లో జరిగిన దాడి కేసులో హార్థిక్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. తాను ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో.. శిక్షపై స్టే విధించాలని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిని కోర్టు కొట్టివేసింది. దీనితో సుప్రీం మెట్లు ఎక్కాడు. 
Read Also : పవన్ కళ్యాణ్‌కి అత్తారింటికి పోవడమే తెలుసు

ఈ పిటిషన్ పై సుప్రీం ఏప్రిల్ 02వ తేదీ మంగళవారం విచారించింది. అంత తొందరేమొచ్చిందని ప్రశ్నించింది. రెండేళ్లు..అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. 2015 సంవత్సరంలో ఎమ్మెల్యే రిషికేష్ పటేల్ కార్యాలయంపై దాడి చేసిన కేసులో హార్ధిక్ పటేల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం లోక్ సభకు ఎన్నికలు జరుగబోతున్నాయి.

కాంగ్రెస్ తరపున బరిలో నిలిచాడు పటేల్. ఏప్రిల్ 04వ తేదీ నామినేషన్ కు లాస్ట్ డేట్. ఈ లోగా సుప్రీం తీర్పును ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం రద్దు చేస్తే హార్ధిక్ పటేల్ ఎన్నికల బరిలో నిలుస్తాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి. 
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష