Harmanpreet Kaur : టీమిండియా కెప్టెన్‌కు కరోనా పాజిటివ్.. క్రికెటర్లను వెంటాడుతున్న మహమ్మారి

కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. అందరిపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పుడు క్రికెటర్లను కరోనా వెంటాడుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పఠాన్ సోదరులు (యూసుఫ్, ఇర్ఫాన్) కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత

Harmanpreet Kaur : టీమిండియా కెప్టెన్‌కు కరోనా పాజిటివ్.. క్రికెటర్లను వెంటాడుతున్న మహమ్మారి

Harmanpreet Kaur Tests Positive For Covid 19

Harmanpreet Kaur : కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. అందరిపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పుడు క్రికెటర్లను కరోనా వెంటాడుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పఠాన్ సోదరులు (యూసుఫ్, ఇర్ఫాన్) కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సైతం కరోనా బారిన పడ్డారు

జ్వరం రావడంతో సోమవారం(మార్చి 29,2021) పరీక్ష చేయించుకున్నారు. రిపోర్టులో కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దరణ అయ్యింది. దీంతో హర్మన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని తెలిపాయి.

ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఆడారు. ఐదు వన్డేల్లో కలిపి మొత్తంగా 160 పరుగులు చేశారు. ఈ సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో కోల్పోయింది. ఇక ఐదో వన్డేలో గాయపడిన హర్మన్‌ ప్రీత్‌, సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యారు. మొత్తంగా క్రికెట్ వర్గాల్లో కోవిడ్ కలకలం రేపుతోంది.