Work From Home : వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తే విడాకులే, ఆలోచింపజేస్తున్న ఓ భార్య లేఖ

కరోనా కారణంగా సాఫ్ట్‌వేర్‌ సహా చాలా రంగాల్లో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు అంతా ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. కాగా, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్

Work From Home : వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తే విడాకులే, ఆలోచింపజేస్తున్న ఓ భార్య లేఖ

Work From Home

Work Frome Home : కరోనా కారణంగా సాఫ్ట్‌వేర్‌ సహా చాలా రంగాల్లో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు అంతా ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. కాగా, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో దాదాపు రెండేళ్ల నుంచి వర్క్‌ ఫ్రం హోం కంటిన్యూ అవుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీలకు, ఉద్యోగులకు ఎలాంటి ప్లస్ పాయింట్లు, లాభాలు ఉన్నాయో తెలీదు కానీ, వర్క్‌ ఫ్రం హోం వల్ల ఇళ్లల్లో ఆడవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి చాకిరి మరింత పెరిగింది. ఈ మేరకు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా చేసిన ట్వీట్‌.. ఈ నివేదికల్లో ఉన్నది వాస్తవమే అని అర్థం అవుతుంది.

Ira Basu : ఫుట్‌పాత్ పైనే జీవనం.. దయనీయ స్థితిలో మాజీ సీఎం మరదలు

ఓ మహిళ తన భర్త కంపెనీకి రాసిన లెటర్‌ని గోయెంకా ట్వీట్‌ చేశాడు. దీనిలో సదరు మహిళ నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం చాలు.. ఇక ఆఫీసుకు పిలవండి అని కోరుతూ యాజమాన్యానికి లేఖ రాసింది. ఇంకొద్ది రోజులు వర్క్‌ ఫ్రం హోం ఇలానే కొనసాగితే.. మా వైవాహిక బంధం ముగుస్తుందని తెలపడం గమనార్హం.

Chicken Blood Parenting : చైనాలో మొదలైన కొత్త ట్రెండ్.. అది నాశనానికే అంటున్న నిపుణులు..!

‘‘సార్‌ నేను మీ కంపెనీలో పని చేసే మనోజ్‌ అనే ఉద్యోగి భార్యను. నేను మీకు సవినయంగా విన్నవించుకుంటుంది ఒక్కటే. నా భర్తకు ఆఫీస్‌కు వచ్చి పనిచేసే అవకాశం ఇవ్వండి. అతను ఇప్పటికే టీకా రెండు డోసులు వేసుకున్నాడు. అన్ని కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తాడు. దయచేసి అతడిని ఆఫీస్‌కు రమ్మనండి. మీరు ఇలానే మరి కొన్నాళ్లు నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం ఇస్తే.. మా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే వర్క్‌ ఫ్రం హోం మొదలైన నాటి నుంచి నాకు పని భారం పెరిగింది. నా భర్త రోజుకు పది సార్లు కాఫీ తాగుతాడు.. ఒక్క గదిలో కూర్చుని పని చేయడు. వేర్వురు గదల్లో కూర్చుంటాడు. పైగా అక్కడంతా చెత్తా చెదారం పడేస్తాడు. ఇక రోజుకు ఎన్నిసార్లు తింటున్నాడో లెక్కేలేదు. వర్క్‌ కాల్స్‌ సమయంలో కునికిపాట్లు పడుతుంటాడు’’ అని తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

అంతేకాదు ‘‘ఇప్పటికే నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారి బాగోగులు చూడ్డానికే సమయం సరిపోవడం లేదు. వారికి తోడు ఇప్పుడు నా భర్త వచ్చి చేరాడు. ఇంతమందికి సేవ చేయడం నా వల్ల కాదు. దయచేసి పెద్ద మనసుతో నా ఇబ్బందిని అర్థం చేసుకుని.. నా భర్తను ఆఫీస్‌కు పిలిచి.. నాకు కొంత విశ్రాంతి ఇవ్వండి’’ అని కోరింది.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్ అయ్యింది. వర్క్‌ ఫ్రం హోంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ఈ లేఖలో చక్కగా వర్ణించారని నెటిజన్లు అంటున్నారు. భర్తలకు వర్క్‌ ఫ్రం హోం వల్ల మాకు పని భారం పెరిగిందని కామెంట్ చేస్తున్నారు.