82 ఏళ్త అత్తను చేటతో కొట్టీ ఈడ్చిపడేసిన కోడలు..వీడియో తీసి వైరల్ చేసిన పిల్లలు

  • Published By: nagamani ,Published On : November 7, 2020 / 01:26 PM IST
82 ఏళ్త అత్తను చేటతో కొట్టీ ఈడ్చిపడేసిన కోడలు..వీడియో తీసి వైరల్ చేసిన పిల్లలు

Haryana : అత్తా కోడళ్లంటే బద్ధశతృవులేనా? ఆడదానికి ఆడదే శతృవా. అత్తను కోడలు అమ్మలా చూసుకోలేదా? కన్న కొడుకుని కంటికి రెప్పలా కాచుకుని పెళ్లి చేసిన తరువాత కోడలిగా వచ్చిన తరువాత ఆమె ఇంటికి భారమైపోతుందా? గుప్పెడు మెతుకులు పెడితే ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటుందనే ఇంగిత జ్ఞానంలోని ఓ కోడలు తన అత్తను పెట్టే హింసలు చూస్తే ఎవ్వరికైనా ఇలాగే అనిపిస్తుంది.


82 ఏళ్ల వృద్ధాప్యంలో ఇంటి పనులు చేయలేదని కోడలు పెట్టే హింసలు..ఈటెల్లాంటి మాటలతో హృదయాన్ని తూట్లు పొడిచేస్తున్నా ఆమె భూదేవంత ఓర్పుతో అన్నింటినీ భరిస్తోంది. దీన్ని ఆసరా చేసుకున్న ఆ కోడలు అత్తను నానా హింసలకు గురిచేస్తోంది. కొట్టటం తిట్టటం..ఈడ్చి పడేయటం…ఇలా చెప్పలేని హింసలు భరిస్తోంది పాపం ఆ 82 ఏళ్ల వృద్ధురాలు.



https://10tv.in/women-have-right-to-live-at-in-laws-home-even-if-estranged-from-husband-rules-supreme-court/
హర్యానాలోని సోనిపేట్‌లో 82 ఏళ్ల అత్తను ఓ కోడలు చెత్త ఎత్తే చేటతో కొట్టింది. ఆ తరువాత అత్త నోరెత్తకుండా కిమ్మని కూడా అనకుండా ఇంటిలోకి వెళ్లినా వదల్లేదు. వెనకే వెళ్లి మరోసారి దారుణంగా కొడుతూ, ఈడ్చుకెళ్తూ, నానా హింసలకు గురి చేస్తున్న హృదయ విదారక దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కోడలు అత్తను కొడుతున్న దృశ్యాలను అక్కడే ఉన్న మనుమలు వీడియో తీసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ గా మారింది.