RTC బస్సులు తిరుగుతున్నాయ్.. తొలి రాష్ట్రం అదే

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 08:48 AM IST
RTC బస్సులు తిరుగుతున్నాయ్.. తొలి రాష్ట్రం అదే

ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వారిని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నప్పుడు.. రాష్ట్రంలోని పలు జిల్లాల వ్యక్తులు ఒకచోటే ఆగిపోయిన వారిని కూడా గమ్యాలకు చేర్చాలనే ఉద్దేశ్యంతో బస్సు సర్వీసులు పునరుద్ధరించాం. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

‘చాలా మందిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాం. అలాంటప్పుడు పొరుగు జిల్లాల్లో ఇరుక్కుపోయి తమ ఇళ్లకు వెళ్లాలనుకునేవారికి ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేయాలనుకున్నాం. అందుకే జిల్లా సర్వీసులు కూడా ఓపెన్ చేశాం’ అని హర్యానా పోలీస్ చీఫ్ మనోజ్ యాదవ్ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. 

టిక్కెట్లు ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలి. గమ్యస్థానాలకు వెళ్లి బస్సులు అక్కడే ఆగిపోతాయి. మార్గం మధ్యలో మరే స్టాప్ ఉండదు. గత వారం రోజులుగా లక్ష మంది వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపిస్తున్నాం. ముందుగా దీని కోసం 29రూట్లను కేటాయించినా తర్వాత బుకింగ్ లు లేకపోవడంతో 9రూట్లు క్యాన్సిల్ చేసేశాం. 

మార్చి 23న హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ లాక్‌డౌన్ ప్రకటించడంతో బస్సు సర్వీసులు ఆపేశారు. తొలి రోజున 196మంది ప్యాసింజర్లు ప్రయాణిచడంతో రూ.42వేల 580రెవెన్యూ వచ్చిందని అధికారులు చెప్పారు. ‘నాన్-ఏసీ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. 52మంది ప్రయాణించాల్సిన బస్సులో కేవలం 30మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు. 

హర్యానా బస్సులతో పాటు ఇండస్ట్రీలు ఓపెన్ చేసుకోవచ్చని.. ప్రొడక్షన్‌కు అనుమతులిచ్చింది. దీంతో 35వేలకు పైగా ఇండస్ట్రీలు తిరిగి పనిచేయనున్నాయి. 

Read Here>> సైకిల్ దొంగగా మారిన వలస కూలీ.. గుండెను పిండేలా క్షమాపణ లేఖ