ఓటు వేయటానికి సైకిల్ పై వచ్చిన సీఎం

10TV Telugu News

మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్  సోమవారం ఉదయం నుంచి  ప్రశాంతంగా జరుగుతోంది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు  కర్నాల్ లోని పోలింగ్ కేంద్రానికి సైకిల్ పై వచ్చారు.  

మరోవైపు  హర్యానాలోని జన నాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా  కుటుంబం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ట్రాక్టర్ పై పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 

×