సుప్రీం వార్నింగ్ : ఆరావళికి హాని జరిగితే ఊరుకోం

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 04:44 AM IST
సుప్రీం వార్నింగ్  : ఆరావళికి హాని జరిగితే ఊరుకోం

ఢిల్లీ: ప్రఖ్యాత ఆరావళి పర్వాతాలకు ఏదైనా (హాని)జరిగితే ఊరుకునేది లేదని హరియాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని..అడవులు..కొండలు..గుట్టలు మాయం అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఆరావళి పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతినిస్తూ హరియాణా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. ఈ అంశంపై దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నిర్మాణాలతో ఆరావళి పర్వతాలకు హాని కలిగితే ఏమాత్రం సహించేది లేదనీ..హర్యానా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 
Read Also : 22 ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి: పాక్ బండారం బట్టబయలు

ప్రతిపక్షాల నుంచి నిరసనలు వచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ఈ సవరణలకు ఫిబ్రవరి 27న హర్యాణా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీనిని వ్యతిరేకిస్తు..పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రియల్ ఎస్టేట్ దారులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందంటూ పిటిషన్‌దారులు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హరియాణా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా చట్టాన్ని అమలు చేయరాదంటూ ఈ నెల 1న ఆదేశాలు జారీ చేసింది.
 

ఈ అంశంపై విచారణ జరిగిన క్రమంలో సుప్రీం ‘ఆరావళి పర్వత శ్రేణుల గురించి తాము లోచిస్తున్నామనీ..ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందనీ..మీకు (రాష్ట్రప్రభుత్వానికి) చెప్పేది ఒక్కటే.. ఆరావళికి, అటవీ ప్రాంతానికి నష్టం కలిగించేలా చర్యలు చేపడితే మీరు సమస్యల్లో పడతారు’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ మొదటివారానికి వాయిదా వేసింది.
Read Also : ప్రపంచంలోనే ఖరీదైన కారు : ధర 131.33 కోట్లు