Haryana : అదిరిపోయే ఆఫర్, బంగారు పతకం సాధిస్తే..రూ. 6 కోట్లు

పోటీలో పాల్గొని బంగారు పతకం సాధిస్తే...వారికి రూ. 6 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై విజేతలుగా నిలిస్తే..వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.

Haryana : అదిరిపోయే ఆఫర్, బంగారు పతకం సాధిస్తే..రూ. 6 కోట్లు

Haryana

Tokyo Olympics Gold Winner : ఒలింపిక్స్ క్రీడలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్న క్రీడాకారులు ఇందులో పాల్గొనడానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. భారతదేశానికి చెందిన పలువురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమౌతున్నారు. ఈక్రమంలో పోటీలో పాల్గొని బంగారు పతకం సాధిస్తే…వారికి రూ. 6 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై విజేతలుగా నిలిస్తే..వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.

తమ రాష్ట్రం నుంచి బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు రూ. 6 కోట్లు, రజతం సాధిస్తే..వారికి రూ. 4 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ. 2.50 కోట్ల నగదు బహుమతి అందచేయనున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ డే సందర్భంగా..హర్యానా ప్రభుత్వం పలు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించింది. ఈ కార్యక్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి నగదు పురస్కారం అందచేయడం జరుగుతుందని, రాష్ట్రానికి చెందిన 30 మంది క్రీడాకారులకు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రూ. 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహాలు అందచేయడం జరిగిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.