అశ్లీల నృత్యాలతో బీజేపీ ఆశీర్వాద్ యాత్ర

అశ్లీల నృత్యాలతో బీజేపీ ఆశీర్వాద్ యాత్ర

హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్న హథిర గ్రామంలో బీజేపీ ఎమ్మల్యే చేసిన ఘనకార్యం రచ్చలేపుతోంది. ప్రాంతం పేరు కురుక్షేత్ర.. చేసేదేమో ఆశీర్వాద్ యాత్ర. కానీ, తానేసార్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చేశోడో తెలుసా.. మహిళలతో అశ్లీలంగా డ్యాన్స్‌లు చేయించారు. వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు కావడంతో దీనికి నాకే సంబంధం లేదు బాబోయ్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

భారతీయ జనతా పార్టీ జన ఆశీర్వాద యాత్ర చేపట్టింది. అందులో భాగంగానే హథిరా గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. బీజేపీ భారీ ఫ్లెక్స్ కట్టించి స్టేజ్ ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ అక్కడికి రావాల్సి ఉంది. ఆ సమయంలో ఇద్దరు సినిమా పాటలకు చిందులేస్తూ రెచ్చిపోయారు. గంటల వ్యవధిలో వీడియో వైరల్‌గా మారింది. 

సోషల్ మీడియా వేదికగా పూర్తిగా నెగటివ్ స్పందన వస్తుండటంతో ఈ తంతు అంతా ఏర్పాటు చేసింది గ్రామ సర్పంచి సునీల్ మెహ్రాఅని బీజేపీకి ఎటువంటి సంబంధం లేదంటూ తానేసర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుభాశ్ సుధా చెప్పారు. దీనికి ఆ సర్పంచ్ వివరణ ఇచ్చుకుంటూ సీఎం రావడానికి లేట్ అయిపోతుందని హిజ్రాలతో డ్యాన్స్ చేయించాం కానీ మహిళలతో కాదని చెప్పుకొచ్చాడు. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేజ్ మీద నలుగురు ఫిమేల్ డ్యాన్సర్లు మూడ గంటల పాటు డ్యాన్స్ వేశారు. హర్యానా సీఎం రావడానికి ముందు జనాన్ని ఆకర్షించేందుకు ఈ కార్యక్రమం చేశారని తెలిపారు. ఈ వీడియోలో కొందరు పోలీసులు కూడా డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.