Haryanaలో చేయి నరికివేసిన ఘటనపై SIT ఏర్పాటు

Man’s arm hacked in Haryana : హర్యానా రాష్ట్రంలో ఓ వ్యక్తి చేయి అడ్డంగా నరికివేసిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేకేత్తిస్తోంది. దీంతో దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేశారు Haryana police. చేతి మీద 786 టాటూ (పచ్చబొట్టు) వేయించుకున్న ఓ ముస్లిం సోదరుడి చేయిని అడ్డంగా నరికేశారని ప్రచారం జరుగుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ సహారాన్ పూర్ లో Akhlaq Salmani నివాసం ఉంటున్నారు. ఆగస్టు 24వ తేదీన తెల్లవారుజామున ఉద్యోగం కోసం వెతుక్కుంటూ..పానిపట్ పట్టణానికి వెళ్లాడు. అక్కడే తన చేయిని సగం నరికివేసినట్లు అక్మల్ పోలీసులకు తెలిపాడు. అతని కుడి చేతిపై 786 నంబర్ గల టాటూ ఉండడం వల్లే ఇంత దారుణానికి తెగబడ్డారని అక్మల్ సోదరుడు వెల్లడించాడు.
786 సంఖ్య అల్లాకు ప్రతిరూపం అని ముస్లీం సోదరులు భావిస్తారు.
నేరం జరిగిందని పానిపట్ పోలీసు సూపరిటెండెంట్ మనీషా చౌదరి ధృవీకరించారు. అయితే..సల్మాని ఇచ్చిన ఫిర్యాదులో పచ్చబొట్టు గురించి ప్రస్తావించలేదన్నారు. సెప్టెంబర్ 07వ తేదీన ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగిందన్నారు.
ఆగస్టు 24వ తేదీన పానిపట్ లోని Kishanpur ప్రాంతానికి వెళ్లి..మంచినీళ్ల కోసం ఓ ఇంటి తలుపు తట్టడం జరిగిందన్నారు. వెంటనే ఆ ఇంట్లో ఉన్నవారు..తనపై ఇటుకలు, కర్రలతో దాడి చేసి అక్కడన ఓ యంత్రం ద్వారా చేయి కట్ చేశారని తెలిపాడన్నారు. అనంతరం రైల్వే ట్రాక్ దగ్గర పడేశారని వెల్లడించారు.
అయితే..Akhlaq Salmani ఓ బాలుడిని లైంగికంగా చిత్రహింసలకు గురి చేశాడని, అక్కడి నుంచి పారిపోతున్న క్రమంలో..ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పానిపట్ పోలీసు సూపరిటెండెంట్ మనీషా చౌదరి చెప్పారు.
కేసులను విచారించడానికి పానిపట్ డీఎస్పీ సతీష్ వాట్స్ ఆధ్వర్యంలో ‘SIT’ ఏర్పాటు చేశారు. తర్వలోనే సిట్ టీం..బాధితుడిని సంప్రదిస్తారని
Akhlaq Salmani కుటుంబం మాత్రం వేరేగా చెబుతోంది. మతం కారణంగా..దాడి చేశారని వెల్లడిస్తున్నారు.
సహారాన్ పూర్ ఎంపీ, బహుజన్ సమాజ్ పార్టీ లీడర్ ఫజ్లూర్ రెహ్మాన్, సమాజ్ వాదీ జిల్లా అధ్యక్షుడు రుద్రసేన్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు రాజ్ గౌతమ్ లు Akhlaq Salmani పరామర్శించడంతో రాజకీయ రంగు అలుముకుంది.