హర్యానాలో డిసెంబర్ 14 నుంచి స్కూళ్లు,కాలేజీలు ప్రారంభం

  • Published By: murthy ,Published On : December 11, 2020 / 11:12 AM IST
హర్యానాలో డిసెంబర్ 14 నుంచి స్కూళ్లు,కాలేజీలు ప్రారంభం

Haryana Schools to Open for Seniors on 14 December : డిసెంబర్ 14 నుంచి ఉన్నతపాఠశాల విద్యార్ధులకు తరగతులు ప్రారంభించేందుకు హర్యానా ప్రభుత్వం సిధ్దమైంది. స్కూలుకు రావటానికి 72 గంటల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన విద్యార్ధులు స్కూళ్లకు రావాలని పాఠశాల విద్యాశాఖ అదేశించింది.

క్లాసులు ప్రారంభించటానికి ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను శానిటైజ్ చేసి సిధ్దంగా ఉంచాలని ఆదేశించింది. వచ్చే సోమవారం నుంచి ఉదయం గం.10ల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 3 గంటలపాటు తరగతులు నిర్వహించాలని హర్యానా ప్రభుత్వ డైరెక్టరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఒక సర్క్యులర్ లో పేర్కోంది.


9,11 తరగతులు డిసెంబర్ 21 నుంచి ప్రారంభమవుతాయని కూడా తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమై దేశవ్యాప్తంగా మార్చి ఆఖరి వారంలో లాక్ డౌన్ అమలవుతున్నప్పటినుంచి విద్యా సంస్ధలు విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత విద్యాసంస్ధలు తిరిగి తెరిచే అంశంలో కేంద్రం రాష్ట్రాలకు స్వేఛ్చనిచ్చింది.



కాగా విద్యార్ధులందరూ స్కూళ్లు, కాలేజీలకు రావటానికి 72 గంటల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న నెగెటివ్ రిపోర్ట్ చూపించాలని ఆదేశించింది. హర్యానాలో ఇప్పటికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11,733 కాగా ఇప్పటి వరకు 2,650 మంది కరోనా బారినపడి మరణించారు.
haryna schools open GO