17 జిల్లాల్లో మొబైల్ ఇంటర్ నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులు నిలిపివేత

17 జిల్లాల్లో మొబైల్ ఇంటర్ నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులు నిలిపివేత

Internet

Haryana suspends mobile internet : రైతులు చేస్తున్న ఆందోళనలు పలు రంగాలపై ప్రభావం చూపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..గత రెండు నెలలుగా రైతులు పోరాటం, ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు, అన్ని dongle సేవలను జనవరి 30వ తేదీ సాయంత్రం 05 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.

Ambala, Yamunanagar, Kurukshetra, Karnal, Kaithal, Panipat, Hisar, Jind, Rohtak, Bhiwani, Charkhi Dadri, Fatehabad, Rewari, Sirsa జిల్లాల్లో ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఈ సేవలు Sonipat, Palwal, Jhajjar నిలిపివేయబడ్డాయి. వీటిని కూడా శనివారం సాయంత్రం 05 గంటల వరకు పొడిగించారు. వాయిస్ కాల్స్ మినహా మొబైల్ నెట్ వర్క్ లలో అందించే సేవలు mobile internet services (2G/3G/4G/CDMA/GPRS), SMS సేవలు (excluding banking and mobile recharge), అన్ని dongle సేవలను నిలిపివేయాలని ఈ మేరకు హర్యానా హోం కార్యదర్శి ఆదేశించారు. ఇంటర్ నెట్ ద్వారా పుకార్లు వ్యాపింప చేయడంతో అంతరాయం, ప్రజా ఆస్తులకు నష్టం, శాంతిభద్రతలకు విఘాతం కలుగడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించింది.