రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వరంట ఓ ఛాయ్ వాలా ఆవేదన

  • Published By: madhu ,Published On : July 23, 2020 / 10:23 AM IST
రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వరంట ఓ ఛాయ్ వాలా ఆవేదన

నేను రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వనంటున్నారు బ్యాంకు వాళ్లు అంటున్నాడు ఓ ఛాయ్ వాల. అంతమొత్తం తీసుకుని ఏమి చేసుకుంటాను. అసలు..తన పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎవరు తీసుకున్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నాడు ఆ ఛాయ్ వాల.

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో..ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రకు చెందిన ఓ రాజ్ కుమార్ 2015 రూ. 20 వేల లోన్ (Muthra Scheme) తీసుకుని ఛాయ్ షాప్ పెట్టుకున్నాడు. రూ. 17 వేల 119 చెల్లించాడు.

ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా..ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టతరమైంది. దీంతో లోన్ తీసుకుంటే బాగుంటుందని భావించి.. అదే బ్యాంకు (Muthra Scheme) కు వెళ్లాడు. ఫామ్ తీసుకుని అప్లై చేసుకున్నాడు. రూ. 50 వేలు కావాలని అప్లై చేశాడు.

కానీ బ్యాంకు సిబ్బంది చెప్పిన మాటలు విని షాక్ కు గురయ్యాడు. Loan రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పారని, ఎందుకని అడిగితే..నువ్వు ఇదివరకే రూ. 50 కోట్ల 76 లక్షల లోన్ తీసుకున్నావని చెప్పారని వాపోయాడు. మరోసారి లోన్ ఇవ్వడం కుదరంటూ స్పష్టంగా చెప్పారన్నారు.

తాను దరఖాస్తు చేయకుండానే…తన పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎలా ? ఎవరికి ఇచ్చారో అర్థం కావడం లేదంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.