Cow To PS : MLA కోసం..పోలీస్​ స్టేషన్​లో ఆవును కట్టేసిన రైతులు..

దేశ రాజధాని సమీపంలో వేలాదిమంది రైతులు గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కానీ హర్యానాలో ఇద్దరు రైతులు మాత్రం వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఆవును తీసుకెళ్లి ఓ పోలీస్ స్టేషన్ లో కట్టేశారు. ఆ ఆవుకు అక్కడే ఆహారం, నీరు అందించే బాధ్యత పోలీసులదే అంటున్నారు.

Cow To PS  : MLA కోసం..పోలీస్​ స్టేషన్​లో ఆవును కట్టేసిన రైతులు..

Cow In Police Station

Farmers Bring Cow To Police Station : రైతులు వ్యవసాయం చేయటం..తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేస్తుంటారు. దేశ రాజధాని సమీపంలో వేలాదిమంది రైతులు గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కానీ హర్యానాలో ఇద్దరు రైతులు మాత్రం వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఆవును తీసుకెళ్లి ఓ పోలీస్ స్టేషన్ లో కట్టేశారు. ఆ ఆవుకు అక్కడే ఆహారం, నీరు అందించాల్సిన బాధ్యత పోలీసులదే అంటున్నారు. ఎందుకంటే నిరసన..ఆ నిరసనత తమ పంటకు గిట్టుబాటు ధర కోసమో..లేదా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూనో కాదు..ఎందుకో తెలిస్తే వార్నీ ఇందుకు కూడా నిరసన తెలుపుతారా? అనిపిస్తుంది.

హర్యానాలోని ఫతేహబాద్​ జిల్లాకు చెందిన వికాస్​ సిసర్​, రవి ఆజాద్ అనే ఇద్దరు రైతులు స్థానిక JJP (జననాయక్ జనతా పార్టీ) ఎమ్మేల్యే దేవేంద్ర సింగ్​ బాబ్లీ ఇంటిని ముట్టడించారు. ఎందుకంటే..ఈ ఎమ్మెల్యే అధికార బిజేపీతో పొత్తు పెట్టుకోవడం రైతులకు అస్సలు నచ్చలేదు. కేవలం వారికే కాదు స్థానిక రైతు సంఘాల నాయకులకు కూడా నచ్చలేదు. దాన్ని వ్యక్తం చేయటానికి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు వికాస్​, రవి ఆజాద్ అనే రైతులు, వారికి కొంతమంది రైతులు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తే పోలీసులు ఊరుకుంటారా మరి..అందుకే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రైతు సంఘాల నాయకులు అలర్ట్‌ అయ్యారు.

ఫతేహబాద్​ తోహనాలో ఉన్న పోలీస్​ స్టేషన్​ ముందు ఆదివారం(జూన్ 6,2021) నిరసన చేపట్టారు. అంతేకాదు.. ఒక ఆవును తీసుకొచ్చి స్టేషన్​ ఆవరణలో ఉన్న ఒక స్థంభానికి కట్టారు. ఈ ఆవు బాధ్యత పోలీసులదే.. దానికి నీరు, దాణా పెట్టడం వారి డ్యూటీ అంటూ భీష్మించుకుని కూర్చున్నారు. మాతో పాటు మా ఆవు కూడా నిరసన తెలుపుతుందన్నారు. ఎందుకంటే రైతుల జీవితాల్లు పశువులు కూడా భాగమే..అందుకే మాతోపాటు మా ఆవుకూడా నిరసన తెలుపుతుందని అన్నారు. ఈ ఆందోళనలో రైతు నాయకుడు రాకేశ్​ తికాయత్​ కూడా పాల్గొన్నారు. మా రైతు సోదరులను విచిడిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో రైతు నాయకులకు, జిల్లా యంత్రాంగానికి మధ్య చర్చలు జరిగాయి. కానీ చర్చలు ఫలించలేదు. దీంతో రైతులు నిరసన కొనసాగించటంతో వెనక్కి తగ్గిన పోలీసులు అర్దరాత్రి వికాస్​ సిసర్​, రవి ఆజాద్ లను బెయిల్​ పై విడుదల చేశారు.

కాగా..ఢిల్లీ సమీపంలో వ్యవసాయం చట్టాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికీ నిరసన కొనసాగించే రైతుల్లో హర్యానా రైతులు చాలామంది ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..హర్యానాలో బీజేపీ పార్టీ జేజేపీ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయినా జేజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకొచ్చిన వ్యవసాయం చట్టాలని వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ క్రమంలో జేజేపీ పార్టీ ఎమ్మెల్యే ఇంటిని ఇంటిని ముట్టడించారు. ఓ పక్క రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని నడుపుతూనే మరోపక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక జేజేపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు.