ఫేస్ ‌బుక్ ఇండియా ఎండీకి ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు

  • Published By: venkaiahnaidu ,Published On : September 12, 2020 / 04:53 PM IST
ఫేస్ ‌బుక్ ఇండియా ఎండీకి ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే. భారత్ లో హేట్ స్పీచ్ పాలసీని మార్చినట్టు వచ్చిన ఆరోపణలు ఫేస్ బుక్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కమిటీ విచారణకు ఆదేశించగా కమిటీ… ఫేస్ బుక్ కు సమన్లు ఇచ్చింది .




ద్వేషపూరిత కంటెంట్ పై చర్య తీసుకోవడంలో ఫేస్ ‌బుక్ విఫలమైందంటూ ఆరోపించిన ఢిల్లీ అసెంబ్లీ కమిటీ…ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ కు సమన్లు జారీ చేసింది. తమ వాదనను వినిపించేందుకు సెప్టెంబర్ 15 న ఢిల్లీ విధానసభ ముందు హాజరుకావాలని, ఈ విషయంపై వివరణ అందించాలని కోరుతూ నోటీసు జారీ చేసింది.


ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజేంద్రనగర్ చెందిన ఎమ్మెల్యే రాఘవ చాదా నేతృత్వంలోని కమిటీ ఈ సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై కొంతమంది సాక్షులను, సాక్ష్యాలను పరిశీలించిన మీద ఈ సమన్లు జారీ చేశామని కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు తీవ్రతరం కావడానికి ఫేస్‌బుక్ కారణమైందని ఆగస్టు 31వ తేదీన జరిగిన రెండో విచారణలో కమిటీ నిర్ధారించడంతో .ఫేస్ బుక్ కు నోటీసులు పంపించింది.
https://10tv.in/mahabubnagar-depot-rtc-bus-conductor-honestly-returns-old-womans-cash-and-gold-bag/