Supreme Court: రాజకీయ నేతలు ఆ పని చేస్తే విధ్వేష ప్రసంగాలు ఆగిపోతాయన్న సుప్రీంకోర్టు

కోర్టులు వీటి మీద చర్యలు తీసుకోవాలని చాలా మంది అంటుంటారని, అయితే దేశ ప్రజలు ఎందుకు ఒక మతాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ విమర్శించబోమని ప్రతిజ్ణ చేయరని కోర్టు ప్రశ్నించింది. టీవీల్లో, ఇతర వేదికల ద్వారా కొన్ని అతీత శక్తులు అనేక విధ్వేష వ్యాఖ్యలు చేస్తున్నాయని, కానీ వాటిపై కేసులు నమోదు చేయడంలో విఫలయత్నాలు కనిపిస్తున్నాయని పేర్కొంది

Supreme Court: రాజకీయ నేతలు ఆ పని చేస్తే విధ్వేష ప్రసంగాలు ఆగిపోతాయన్న సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court: మతం నుంచి, మతాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకోవడం నుంచి రాజకీయ నాయకులు ఎప్పుడైతే దూరం జరుగుతారో అప్పుడు దేశంలో విధ్వేష ప్రసంగాలే ఉండవని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. విధ్వేష ప్రసంగాలపై దేశం నలుమూలల నుంచి దాఖలైన ఫిర్యాదుల మీద విచారించిన సుప్రీం ధర్మాసనం.. విధ్వేష శక్తులైనా ఇతరులైనా ఇలాంటివి చేయకుండా తమను తాము నియంత్రించుకోవాలని సుప్రీం సూచించింది.

Karnataka Polls: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? సర్వేలో ఆసక్తికరమైన సమాధానాలు

జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ మాజీ ప్రధానమంత్రులు జవహార్‭లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజిపేయి లాంటి వారు చేసే ప్రసంగాలను రిమోట్ (అడవి ప్రాంతాలు) ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వినడానికి ఇష్టపడేవారని పేర్కొంది. ‘‘ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే.. రాజకీయ నాయకులు రాజకీయాలను మతంతో పులిమేస్తున్నారు. రాజకీయాలను, మతాల్ని వేరు చేసినప్పుడు ఇది ముగుస్తుంది. రాజకీయ నాయకులు మతాన్ని వాడుకోవడం ఆపేస్తే ఇది కూడా ఆగిపోతుంది. రాజకీయాలను మతానితో కలపడం ప్రమాదకరమని ఇటీవలే తీర్పు కూడా చెప్పాము’’ అని ధర్మాసనం పేర్కొంది.

Amritpal Singh: సంచలనంగా అమృతపాల్ వీడియో సందేశం.. పారిపోయిన తర్వాత మొదటిసారి వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ లీడర్

కోర్టులు వీటి మీద చర్యలు తీసుకోవాలని చాలా మంది అంటుంటారని, అయితే దేశ ప్రజలు ఎందుకు ఒక మతాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ విమర్శించబోమని ప్రతిజ్ణ చేయరని కోర్టు ప్రశ్నించింది. టీవీల్లో, ఇతర వేదికల ద్వారా కొన్ని అతీత శక్తులు అనేక విధ్వేష వ్యాఖ్యలు చేస్తున్నాయని, కానీ వాటిపై కేసులు నమోదు చేయడంలో విఫలయత్నాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటనను కోర్టు ఉదహరించింది. విధ్వేష వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీటి వల్ల కూడా విధ్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది.