Siddique Kappan: 22 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్న జర్నలిస్టుకు బెయిల్.. న్యూస్ రిపోర్ట్ చేసేందుకు వెళ్తుండగా అరెస్టైన సిద్ధిక్

22 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధిక్ అనే జర్నలిస్టుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హత్రాస్‌లో జరిగిన ఒక అత్యాచార కేసులోని రహస్యాలను వెలికితీసేందుకు వెళ్తుండగా పోలీసులు అతడ్ని 2020లో అరెస్టు చేశారు.

Siddique Kappan: 22 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్న జర్నలిస్టుకు బెయిల్.. న్యూస్ రిపోర్ట్ చేసేందుకు వెళ్తుండగా అరెస్టైన సిద్ధిక్

Siddique Kappan: ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటనను రిపోర్ట్ చేసేందుకు వెళ్లి, కుట్ర కేసులో అరెస్టైన జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ కేసుకు సంబంధించి అతడు 2020 అక్టోబర్ నుంచి జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే

అనేకసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా, కింది కోర్టులు వివిధ కారణాలతో నిరాకరించాయి. అయితే, తాజాగా భారత సుప్రీంకోర్టు సిద్ధిక్‌కు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయపడింది. 2020 సెప్టెంబర్‌లో హత్రాస్‌లో ఒక దళిత యువతి నలుగురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసు వివాదాస్పదమైంది. ఈ కేసులో ఉన్న రహస్యాల్ని చేధించేందుకు ఒక మలయాళ న్యూస్ పోర్టల్‌‌లో జర్నలిస్టుగా చేస్తున్న సిద్ధిక్ హథ్రాస్ వెళ్లగా మార్యమధ్యలో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ పీఎఫ్ఐతో కూడా సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపించారు.

Queen Elizabeth II: 15 రాజ్యాలకు రాణి.. 23226 రోజుల పాలన.. ఇదీ క్వీన్ ఎలిజబెత్ ప్రస్థానం

2020లో అరెస్టైన అతడిపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో దాదాపు 22 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. పలుసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టులు నిరాకరించాయి. తాజాగా భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సిద్ధిక్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అతడు ట్రయల్ కోర్టు విచారణ, అనుమతి కోసం ఆరు వారాలపాటు ఢిల్లీ పరిధిలోనే ఉండాలని సూచించింది. ఆరు వారాల తర్వాత మాత్రమే సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లొచ్చని సూచించింది. ప్రతి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.