Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..

చిన్న పిల్లలకు జలుబు, జ్వరం లాంటి చిన్న సమస్యలు ఎదురైతేనే మనం తల్లడిల్లి పోతాం. ఆ సమయంలో చిన్నారులు పడే ఇబ్బందులు చూడలేక త్వరగా నయం కావాలని ఎంతో మంది దేవుళ్లను మొక్కుకుంటాం. ఇక్కడ ఓ చిన్నారి రెండున్నరేళ్లుగా వింత రూపంతో జన్మించి బాధపడుతుంది. జన్యులోపంతో జన్మించిన ఆ చిన్నారికి పొట్ట భాగంలో అదనంగా రెండు చేతులు, రెండు కాళ్లతో జన్మించింది...

Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..

Sonu Sood

Viral video: చిన్న పిల్లలకు జలుబు, జ్వరం లాంటి చిన్న సమస్యలు ఎదురైతేనే మనం తల్లడిల్లి పోతాం. ఆ సమయంలో చిన్నారులు పడే ఇబ్బందులు చూడలేక త్వరగా నయం కావాలని ఎంతో మంది దేవుళ్లను మొక్కుకుంటాం. ఇక్కడ ఓ చిన్నారి రెండున్నరేళ్లుగా వింత రూపంతో జన్మించి బాధపడుతుంది. జన్యులోపంతో జన్మించిన ఆ చిన్నారికి పొట్ట భాగంలో అదనంగా రెండు చేతులు, రెండు కాళ్లతో జన్మించింది. రోజువారి కూలీ పనులు చేసుకుంటేనే జీవనం గడవాల్సిన కుటుంబంలో అలాంటి చిన్నారి జన్మించడంతో తల్లిదండ్రుల బాధలు వర్ణణాతీతం. గత రెండేళ్లుగా చిన్నారి పొట్ట భాగం నుంచి అదనంగా వచ్చిన కాళ్లు, చేతులు తొలగింపజేలా తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక, సహాయం చేసేందుకు ఎవరూ ముందుకురాక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఆ చిన్నారి బీహార్ లోని నెవాడా జిల్లా నివాసి బసంత్ పాశ్వాన్ కుమార్తె. చిన్నారి పేరు చౌముఖి. పుట్టినప్పటి నుండి నాలుగు చేతులు, నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఆ చిన్నారి వింత ఆకారం చూసి మిగిలిన పిల్లలు ఆడుకొనేందుకు భయపడేవారట. చికిత్స చేయించేందుకు బసంత్ పాశ్వాన్ అనేక మందిని సహాయం కోరాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ వింత ఆకారంతో చిన్నారిసైతం అనేక ఇబ్బందులు పడుతుండేది. అది చూడలేక ఎన్నోసార్లు తల్లిదండ్రులు కన్నీరుసైతం పెట్టుకున్నారు. ఓ సారి బసంత్ పాశ్వాన్ కూతురికి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. అయితే డాక్టర్ ఆపరేషన్ చేయడానికి నిరాకరించడంతో నిరాశతో ఇంటికి తిరిగొచ్చాడు. చిన్నారి ఎదుర్కొంటున్న సమస్యను వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ గా మారి బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనుసూద్ దృష్టికి వెళ్లింది.

Sonu Sood: సౌత్ VS నార్త్.. అజయ్‌, సుదీప్‌ల ట్విటర్‌ వార్‌పై సోనూసూద్‌ కామెంట్స్!

కరోనా సమయంలో సోనూసూద్ ఎంతో మందికి సహాయం అందించి మానవ రూపంలో భుమిపైకి వచ్చిన దేవుడిలా మారాడు. ఆపదలో ఉన్నాను సాయం చేయండి అంటే చాలు ఎక్కడున్నా వాలిపోయి సాయం అందించడం సోనూసూద్ కు అలవాటు. రెండున్నరేళ్ల చిన్నారి సమస్య సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో చిన్నారికి శస్త్ర చికిత్స చేయించేందుకు ముందుకొచ్చాడు. అంతేకాదు ఆ చిన్నారికి వైద్యం అందుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని పార్ధించండి అని ట్వీట్ చేశారు. ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న వైద్యులు త్వరలోనే చిన్నారికి నయం అవుతుందని, ఆమె సాధారణ మనుషుల వలే తిరగగలుతుందని తెలిపినట్లు చిన్నారి తండ్రి బసంత్ పాశ్వాన్ అన్నారు. సోనూసూద్ సాయంతో నా బిడ్డ ఇక నుంచి అందరితో ఆదుకుంటుందని ఆనంద భాష్పాలతో చెప్పాడు. చిన్నారికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిన్నారి త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అదే సమయంలో సోనుసూద్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే సోనుసూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన అనంతరం అనేక మంది మేము చిన్నారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామంటూ ముందుకొస్తున్నారు.