HDFC Bank Fined: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కార్ లోన్ కేసులో రూ.10కోట్ల ఫైన్

ఆటో లోన్ కస్టమర్లకు తప్పుడు కారణాలతో పెనాల్టీ వేస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10కోట్ల ఫైన్ విధించింది. ఓ వ్యక్తి చేసిన కంప్లైంట్ రీత్యా హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఆరుగురు ఉద్యోగులను తొలగించింది.

HDFC Bank Fined: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కార్ లోన్ కేసులో రూ.10కోట్ల ఫైన్

Hdfc Bank

HDFC Bank Fined: ఆటో లోన్ కస్టమర్లకు తప్పుడు కారణాలతో పెనాల్టీ వేస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10కోట్ల ఫైన్ విధించింది. ఓ వ్యక్తి చేసిన కంప్లైంట్ రీత్యా హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఆరుగురు ఉద్యోగులను తొలగించింది. అప్పు తీసుకునే వారిని కచ్చితంగా జీపీఎస్ డివైజ్ ను ఆ ఒక్క ప్రొవైడర్ నుంచే తీసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

ఈ స్కాంలో బ్యాంక్ ఆటో లోన్ బిజినెస్ హెడ్ అశోఖ్ ఖన్నాను పదవి నుంచి తొలగించారు. ‘డాక్యుమెంట్ల టెస్టింగ్ లో భాగంగా.. బ్యాంకు కస్టమర్లకు థర్డ్ ఫార్టీ నాన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ను బలవంతంగా అంటగడుతున్నారు. దీనిపై ఆర్బీఐకి చెందిన ఆటో లోన్ పోర్ట్ ఫోలియోకు కంప్లైంట్ వచ్చింది’ అని ఆర్బీఐ స్టేట్మెంట్ లో విడుదల చేసింది.

కస్టమర్ చేసిన కంప్లైంట్ మేరకు ఆర్బీఐ షోకాజ్ నోటీసులు పంపించింది. పర్సనల్ హియరింగ్ లో మోనెటరీ పెనాల్టీ జొప్పించినట్లు సమాచారం.