HDFC Job Circular : కరోనా బ్యాచ్ అనర్హులు, వైరల్‌గా మారిన జాబ్ నోటిఫికేషన్

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఓ జాబ్ సర్కులర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జాబ్ సర్కులర్‌లో ఉన్న కండీషన్ చూసి అంతా విస్తుపోతున్నారు. ఇదెక్కడి చోద్యం అని అవాక్కవుతున్నారు. అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ అందులో ఏముందో తెలుసా.. కరోనా బ్యాచ్ కి నో ఎంట్రీ.

10TV Telugu News

HDFC Job Circular : ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఓ జాబ్ సర్కులర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జాబ్ సర్కులర్‌లో ఉన్న కండీషన్ చూసి అంతా విస్తుపోతున్నారు. ఇదెక్కడి చోద్యం అని అవాక్కవుతున్నారు. అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ అందులో ఏముందో తెలుసా.. కరోనా బ్యాచ్ కి నో ఎంట్రీ. అంటే, 2021లో ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అనర్హులు అని అర్థం. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్.. డిగ్రీ క్వాలిఫికేషన్ తో.. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో.. 2021 పాసవుట్ బ్యాచ్ నాట్ ఎల్జిబుల్ అని స్పష్టంగా ఉంది. ఈ కండీషన్ కారణంగా జాబ్ సర్కులర్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇదెక్కడి చోద్యం రా బాబూ అని అంతా విస్తుపోతున్నారు. ఈ సర్కులర్ ను తెగ షేర్ చేస్తున్నారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

ఈ సర్కులర్ వైరల్ కాడం, వివాదానికి దారి తీయడంతో హెచ్ డీ ఎఫ్ సీ యాజమాన్యం స్పందించింది. ఈ సర్కులర్ పై స్పష్టత ఇచ్చింది. అది అక్షర దోషం అని వివరణ ఇచ్చింది. సర్కులర్ లో తప్పు వచ్చినందుకు విచారం వ్యక్తం చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఈ ఉద్యోగాలు అర్హులు అని, పాస్ అయిన సంవత్సరంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కరెక్షన్ చేసిన సర్కులర్ ని మళ్లీ షేర్ చేసినట్టు హెచ్ డీఎఫ్ సీ తెలిపింది.

కాగా, ఈ సర్కులర్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పరీక్షలు లేకుండా పాసై కరోనా బ్యాచ్ గా ముద్రవేయించుకున్న విద్యార్థులు ఎందుకూ పనికిరాకుండా పోతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని వాపోతున్నారు.

10TV Telugu News