Gwalior Constable: డబ్బులడిగి విసిగిస్తున్నాడంటూ ఆరేళ్ల బాలుడిని గొంతు పిసికి చంపిన పోలీస్ కానిస్టేబుల్

అన్నెంపున్నెం ఎరుగని ఓ బాలుడు, తినడానికి డబ్బులు అడుక్కొంటుండగా..పదే పదే డబ్బులు అడిగి విసిగిస్తున్నాడంటూ ఆ బాలుడిని హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు

Gwalior Constable: డబ్బులడిగి విసిగిస్తున్నాడంటూ ఆరేళ్ల బాలుడిని గొంతు పిసికి చంపిన పోలీస్ కానిస్టేబుల్

Datia

Gwalior Constable: ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టినా..సంయమనం పాటించి సహనంగా ఉండాల్సిన పోలీసు..చివరకు విచక్షణ మరిచి ఓ పసి బాలుడిని దారుణంగా హత్య చేశాడు. అన్నెంపున్నెం ఎరుగని ఓ బాలుడు, తినడానికి డబ్బులు అడుక్కొంటుండగా..పదే పదే డబ్బులు అడిగి విసిగిస్తున్నాడంటూ ఆ బాలుడిని హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు. మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో మే 5న చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన..బుధవారం(మే 11న) హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ అనంతరం వెలుగులోకి వచ్చింది. దతియా జిల్లా ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్..గురువారం వార్తా సంస్థ ఏఎన్ఐకు కేసు వివరాలు వెల్లడించారు. గ్వాలియర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రవి శర్మ..బాలుడిని హత్య చేశాడు. స్థానికంగా నివాసముంటున్న ఆరేళ్ళ బాలుడు ఆహారం కోసమని పలువురిని డబ్బులు అడిగాడు. ఈక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవి శర్మ వద్దకు వచ్చి ఆ బాలుడు డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పినా..బాలుడు పదే పదే అడిగి విసిగించాడు.

Also read:Honeytrap: హనీ ట్రాప్‌లో భారత వైమానిక దళ జవాన్.. భార్య బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద నగదు..

బాలుడి తీరుతో చిరాకు పడ్డ కానిస్టేబుల్ రవి శర్మ..విచక్షణ కోల్పోయి బాలుడి గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంలో తీసుకెళ్లి దతియా పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంగా, గ్వాలియర్ – ఝాన్సీ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసాడు రవి శర్మ. బాలుడి మృతదేహం గురించి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు..ఆ ప్రాంతంలో సీసీటీవీలను విశ్లేషించగా అసలు విషయం తెలిసింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ రవి శర్మ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపగా..తానే బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు.

Also read:Proddatur Crime: ఎస్సి మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారం: కేసు కూడా నమోదు చేయని ప్రొద్దుటూరు పోలీసులు?

డబ్బుల కోసం బాలుడు పదే పదే విసిగించడంతోనే రవిశర్మ ఈఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే తాను గత కొన్ని నెలలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడి బాధపడుతూ, నిరాశలో చిక్కుకున్నానని, దీంతో ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియడం లేదని రవిశర్మ పోలీసు విచారణలో పేర్కొన్నాడు. హత్యకు గురైన బాలుడు దతియా పట్టణానికి చెందిన మయాంక్(6)గా పోలీసులు గుర్తించారు. రవిశర్మను ఇప్పటికే విధుల నుంచి తొలగించి అతన్ని అరెస్ట్ చేశామని ఎస్పీ అమన్ సింగ్ పేర్కొన్నారు.