వంటపాత్రలో ఇరుక్కున్న చిన్నారి తల

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 03:21 AM IST
వంటపాత్రలో ఇరుక్కున్న చిన్నారి తల

రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఓ చిన్నారి తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ అన్నం వండే పాత్రలో తలను దూర్చింది. అయితే తల అందులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి గుక్కపెట్టి ఏడ్వడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ పాత్రను తీయడానికి ప్రయత్నించారు. 

అయితే అది ఎంతకూ రాకపోవడంతో గ్రామస్తులకు సమచారం ఇచ్చారు. ఓ వృద్ధుడు ఆ పాత్రను కత్తిరించాడు. దీంతో చిన్నారి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్తులంతా ఆ వృద్ధుడిని అభినందించారు.