గతం కంటే ప్రమాదంగా కరోనా.. కొత్త లక్షణాలు ఇవే!

గతం కంటే ప్రమాదంగా కరోనా.. కొత్త లక్షణాలు ఇవే!

Corona Dust Persist

New symptoms of covid 19: కరోనా సెకెండ్ వేవ్ విస్తరిస్తూ భయపెట్టేస్తుంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కరోనా విస్తరిస్తూ ఉండగా.. ప్రజలు మాత్రం భయపడకుండా తిరుగుతూ ఉండడంతో కరోనా తీవ్రత విపరీతంగా పెరిపోతుంది. ఇదిలా ఉంటే సెకెండ్ వేవ్‌లో కొవిడ్‌ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులు ఉంటున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షిస్తే పాజిటివ్‌ వస్తోందని వెల్లడించారు.

కనుగుడ్డు నుంచి సైతం వైరస్‌ శరీరంలోనికి చేరుతోందని, వారిలో కళ్లు ఎర్రబడుతున్నట్లుగా చెబుతున్నారు. గుంటూరుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి నాలుగు రోజుల కిందట జ్వరం వచ్చి తగ్గింది. ఒళ్లు నొప్పులు తగ్గడంలేదని, అనుమానంతో పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది. జ్వరంతో విరేచనాలు వచ్చినా కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఒళ్లు, కీళ్ల నొప్పులతో వచ్చిన వారికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని, గుంటూరు, విజయవాడ, విశాఖ జిల్లాల్లో ఈ తరహా లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు డాక్టర్లు చెప్పారు. యువకులకే ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. తొలిదశలో 40-45 సంవత్సరాల మధ్య వయసువారు కరోనా బారిన ఎక్కువగా పడగా.. ఇప్పుడు 20నుంచి 35ఏళ్లలోపు వారికి ఎక్కువగా కరోనా సోకుతోంది. లేటెస్ట్‌గా నమోదవుతున్న కేసుల్లో 20-25% మంది యువతే.

మొదట్లో వైరస్ వ్యాపించిన కాలంలో ఒకేసారి రెండు, మూడు కేసులు మాత్రమే వచ్చేవని, ఇఫ్పుడు మాత్రం ఒకేసారి 10, 15కేసులు వస్తున్నట్లుగా చెబుతున్నారు. కరోనా గతం కంటే ప్రమాదకరంగా విస్తరిస్తున్నదని డాక్టర్లు చెబుతున్నారు.