School Headmaster Fail: ఓ గాడ్..! ప్రధానోపాధ్యాయురాలే ఇలా ఉంటే పిల్లలకెలా చదువొచ్చేది.. కంగుతిన్న కలెక్టర్ ఏం చేశారంటే..!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా కలెక్టర్ గిరీష్ కుమార్ ఓ పాఠశాలను తనిఖీ చేశాడు. క్లాస్ రూంలోకి వెళ్లి గణితంలోని చిన్న లెక్కను ఇచ్చి పరిష్కరించమని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు విఫలం కావటంతో అక్కడే ఉన్న క్లాస్ టీచర్, ప్రధానోపాధ్యాయురాలికి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ తెలిపాడు. ఆమెసైతం తప్పుగా చెప్పడంతో కంగుతిన్న కలెక్టర్.. ప్రధానోపాధ్యాయురాలి పోస్టు నుంచి ఆమెను తొలించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

School Headmaster Fail: ఓ గాడ్..! ప్రధానోపాధ్యాయురాలే ఇలా ఉంటే పిల్లలకెలా చదువొచ్చేది.. కంగుతిన్న కలెక్టర్ ఏం చేశారంటే..!

Teacher

School Headmaster Fail: విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందాలంటే ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారివారి సబ్జెక్టు‌ల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. అలాకాకుండా అరకొర జ్ఞానంతో విద్యాబోధన చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి తరహా ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ‘441/4’ గణిత సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. దీంతో కంగుతిన్న కలెక్టర్ ఆమెను పోస్టు నుంచి తొలగిస్తూ ఆదేశాలుజారీ చేశారు.

Ind Vs Pak Match: హైవోల్టేజ్ మ్యాచ్.. నేడు దాయాది జట్ల మధ్య సమరం.. వారు రాణిస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే..

మధ్య ప్రదేశ్ లోని బాలాఘాట్ కలెక్టర్ గిరీష్ కుమార్ మిశ్రా పాఠశాలల్లో తనిఖీకి వెళ్లారు. ఓ గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించాడు. స్కూల్ లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో, టీచర్ ఎలా బోధిస్తుందో తెలుసుకునేందుకు పిల్లలతో కొద్దిసేపు కలెక్టర్ ముచ్చటించాడు. ఈ క్రమంలో బ్లాక్ బోర్డుపై 411 సంఖ్యను 4తో భాగించమని పిల్లలకు సూచించాడు. వారు తప్పుగా రాయడంతో.. అక్కడే ఉన్న క్లాస్ టీచర్, ప్రధానోపాధ్యాయురాలు స్పందిస్తూ లాక్ డౌన్ కారణంగా చాలా మంది పిల్లలు గణితాన్ని మరిచిపోయారని, తిరిగి మళ్లీ వారికి బోధిస్తున్నామని తెలిపింది. దీంతో కలెక్టర్.. సదరు ప్రధానోపాధ్యాయురాలిని ఈ లెక్కను పరిష్కరించి విద్యార్థులకు వివరించండి అని సూచించారు. ఆమె బ్లాక్ బోర్డు వద్దకు వెళ్లి 441/4 గణితంలోని ప్రాబ్లంను సాల్వు చేయడంలో విఫలమైంది. కంగుతిన్న కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

TS Police Constable Exam: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష.. అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాలి

గణితంలో చిన్న సమస్యను మీరు సరిగా పరిష్కరించలేనప్పుడు పిల్లలకు ఏం చెబుతారంటూ కలెక్టర్ నిలదీశాడు. పైగా లాక్ డౌన్ కారణంగా పిల్లలు మర్చిపోయారని చెబుతారా అంటూ కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే ఆమెను ప్రధానోపాధ్యాయురాలి బాధ్యతల నుంచి తొలగించాలని, ఆమె జీతాల పెంపును నిలిపివేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.