Kids Vaccination : 15ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్.. ఎప్పటి నుంచి అంటే..

త్వరలోనే 15ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ గురించి సైంటిఫిక్ డేటా రాగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Kids Vaccination : 15ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్.. ఎప్పటి నుంచి అంటే..

Kids Vaccination

Kids Vaccination : కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో పిల్లలకు వ్యాక్సిన్ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. 15ఏళ్లలోపు పిల్లలకు ఎప్పటి నుంచి టీకాలు ఇస్తారనేది తెలియాల్సి ఉంది.

దీనిపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్పందించారు. త్వరలోనే 15ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ గురించి సైంటిఫిక్ డేటా రాగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. అటు థర్డ్ వేవ్ లో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నా నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు 15 నుంచి 18 ఏళ్ల ఏజ్ గ్రూపుకి చెందిన వారిలో 52శాతం మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు.

Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు

”మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. ఆ రాష్ట్రాలకు కేంద్రం స్పెషల్ హెల్త్ టీమ్స్ పంపింది. ఆ బృందాలు అక్కడి పరిస్థితులపై రివ్యూ చేస్తుంటాయి. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, యూపీ, గుజరాత్, ఒడిశా, ఢిల్లీ, రాజస్తాన్ లలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి” అని రాజేశ్ భూషన్ తెలిపారు.

దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కేసులు 3 లక్షల మార్కును దాటేశాయి. నిన్న ఒక్కరోజే 3,17,532 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇది 249 రోజుల గరిష్ఠం కావడం గమనార్హం. 19,35,180 టెస్టులు చేయగా.. పాజిటివిటీ రేటు 16.41 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే పాజిటివిటీ రేటు ఒక శాతం పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 16.06 శాతంగా నమోదైంది.

Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కరోనాతో మరో 491 మంది మరణించారు. నిన్న 2,23,990 మంది కోలుకోగా.. మొత్తం 3,58,07,029 మంది రికవర్ అయ్యారు. రికవరీ రేటు 93.69 శాతం. ఒమిక్రాన్ కేసులు 9,287కి పెరిగాయి. 72శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారు.