Corona 2nd Wave : జాగ్రత్త.. ముప్పు తొలగలేదు.. కరోనాపై కేంద్రం తాజా హెచ్చరిక

దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి

Corona 2nd Wave : జాగ్రత్త.. ముప్పు తొలగలేదు.. కరోనాపై కేంద్రం తాజా హెచ్చరిక

Corona 2nd Wave

Corona 2nd Wave : దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరిస్తూ పలు సూచనలు చేసింది. ఉత్సవాలు, పర్వదిన వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిని వివరించారు.

COVID Vaccines : ఈ వ్యాక్సిన్లు ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుంటాయి..సరికొత్త కోవిడ్ టీకాలు

గతవారంతో పోలిస్తే కేరళలో 68శాతం కేసులు పెరిగాయని అన్నారు. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో పాజిటివ్‌ రేట్‌ ఎక్కువగా ఉందన్నారు. కరోనా జాగ్రత్తలు ఇంకా పాటించాలని సూచించారు. పండుగలు, ఉత్సవాలు అంటూ గుమికూడొద్దని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు.

ముఖ్యంగా కేరళలో కరోనా విజృంభణపై రాజేశ్‌ భూషణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్‌ వేవ్‌ ఇంకా కొనసాగుతోందని గుర్తుచేశారు. ఇది ఇంకా ముగిసిపోలేదని ప్రకటించారు.

Covid Vaccine.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చగలదు.. ఎలాగంటే?

దేశంలో కొత్తగా 43వేల 263 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,31,39,981కి చేరింది. క‌రోనాతో మ‌రో 338 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,749కి పెరిగింది.

అలాగే, నిన్న 40వేల 567 మంది కోలుకున్నారు. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,23,04,618 మంది కోలుకున్నారు. 3,93,614 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో నిన్న 86,51,701 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 71,65,97,428 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 30,196 కొత్త కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 181 మంది ప్రాణాలు కోల్పోయారు.