Gujarat : స్కూల్ బస్ డ్రైవర్‌కు గుండెపోటు..బస్సును కంట్రోల్ చేసి విద్యార్ధుల ప్రాణాలు కాపాడిన చిన్నారి

ఓ చిన్నారి చేసిన సాహసం ఎంతోమంది విద్యార్ధుల ప్రాణాలు కాపాడింది. స్కూల్ విద్యార్ధుల్ని  బస్సులో తీసుకెళుతుండగా డ్రైవర్ సడెన్ గా గుండెపోటుకు గురి అయ్యాడు.స్టీరింగ్ వదిలేసి పక్కకకు ఒరిగిపోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి ఇస్టానుసారంగా పోతూ పలు వాహనాలను ఢీకొట్టింది. అది గమనించిన ఓ విద్యార్థిని వెంటనే బస్సును కంట్రోల్ చేసింది. దీంతో బస్సులోని విద్యార్ధులంతా ప్రాణాలతో బయటపడ్డారు.

Gujarat : స్కూల్ బస్ డ్రైవర్‌కు గుండెపోటు..బస్సును కంట్రోల్ చేసి విద్యార్ధుల ప్రాణాలు కాపాడిన చిన్నారి

heart attack to School bus driver

Gujarat : గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌లో ఓ చిన్నారి చేసిన సాహసం ఎంతోమంది విద్యార్ధుల ప్రాణాలు కాపాడింది. స్కూల్ విద్యార్ధుల్ని  బస్సులో తీసుకెళుతుండగా డ్రైవర్ సడెన్ గా గుండెపోటుకు గురి అయ్యాడు.స్టీరింగ్ వదిలేసి పక్కకకు ఒరిగిపోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి ఇస్టానుసారంగా పోతూ పలు వాహనాలను ఢీకొట్టింది. అది గమనించిన ఓ విద్యార్థిని వెంటనే బస్సును కంట్రోల్ చేసింది. దీంతో బస్సులోని విద్యార్ధులంతా ప్రాణాలతో బయటపడ్డారు.

రాజ్‌కోట్‌లోని భరద్‌ పాఠశాలకు చెందిన బస్సు శనివారం (ఫిబ్రవరి 4,2023) సాయంత్రం స్కూల్ నుంచి విద్యార్దులకు వారి వారి గమ్యస్థానాలకు చేర్చటానికి స్కూల్ నుంచి ఓ బస్సు బయలుదేరింది. అలా బస్సు గొండాల్‌ రోడ్డు వద్దకు రాగానే డ్రైవరు గుండెపోటు వచ్చింది. నొప్పి భరించలేక మెలికలు తిరిగిపోయాడు. స్టీరింగ్ వదిలేసి పక్కకు ఒరిగిపోవటంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ దాటిన బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటూ పోయింది.

దీంతో డ్రైవర్ సీటు పక్కనే కూర్చున్న భార్గవి అనే విద్యార్థిని వెంటనే స్టీరింగు పట్టుకొని బస్సును కంట్రోల్ చేసింది. దీంతో పెనుప్రమాదం తప్పింది. బస్సులో విద్యార్దులంతా ప్రాణాలతో బయటపడ్డారు.అంతేకాదు డ్రైవర్‌ హారున్‌భాయ్‌ రాజ్‌కోట్‌ సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలా డ్రైవర్ తో పాటు పలువురు విద్యార్ధుల ప్రాణాలు కాపాడింది భార్గవి.