Heart Breaking Scenes : ఢిల్లీలో కరోనా కల్లోలం, హాస్పిటల్ బయట ఆర్థనాదాలు..వీడియో వైరల్

Heart Breaking Scenes : ఢిల్లీలో కరోనా కల్లోలం, హాస్పిటల్ బయట ఆర్థనాదాలు..వీడియో వైరల్

Delhi

Gangaram Hospital In Delhi : కరోనా వైరస్‌ రెండో వేవ్ ఉధృతి కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్‌ కొరతతో అల్లాడిపోతోంది. సమయానికి ఆక్సిజన్‌ లభించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా..ఆసుపత్రులలో రోగులను చేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. చివరి సమయంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతుండడంతో పరిస్థితి దయనీయంగా మారింది. గంగారం ఆసుపత్రి వద్ద హృదయవిదాకరమైన ఘటనలు కనిపిస్తున్నాయి.

కొంతమంది ఆక్సిజన్ లేక విలవిలలాడుతున్నారు. ఏమి చేయలేని పరిస్థితిలో వారు కుటుంబసభ్యులు ఉంటున్నారు. కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోవడంతో…ఓ వ్యక్తి ఆసుపత్రి వద్ద ఏడుస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Hemant Rajaura అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ఢిల్లీలోని జైపూర్‌ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత వల్లే 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ నిల్వలు లేక ఢిల్లీలోని సరోజ్‌ ఆస్పత్రిలో అడ్మిషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతమున్న రోగులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు. బాత్రా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్‌ నిల్వల కొరత ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గట్లు ఆక్సిజన్‌ అందకపోవడంతో ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఆక్సిజన్ అవసరాలు తీర్చాలని కేజ్రీవాల్‌ అన్ని రాష్ట్రాలను అభ్యర్థిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశంలోని ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరత తీర్చాలని సీఎంలకు విజ్ఞప్తి చేశారు. మీ రాష్ట్ర అవసరాలకు పోగా మిగులు ఆక్సిజన్‌ మాకు అందజేయండి అని కోరుతూ ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు సాయం అందిస్తోన్నా… కరోనా తీవ్రత వల్ల ఆక్సిజన్‌ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తానని వెల్లడించారు కేజ్రీవాల్.

Read More : Biological E : హైదరాబాద్ నుంచి మరో టీకా, మూడో దశ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్