Nirma : ‘నిర్మా’వాషింగ్ పౌడర్ యాడ్ లో తెల్లగౌను పాప గురించి షాకింగ్ విషయాలు..పేరు వెనుక పెను విషాదం

‘వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా..పాలలోను తెలుపు నిర్మాతో వచ్చింది..రంగుల బట్టలే తళతళగా మెరిసాయి’..అనే యాడ్ లో తెల్లటి గౌను వేసుకుని..గుండ్రంగా తిరిగే చిన్నపాప గురించి నిర్మా పేరు వెనుక ఉన్న పెను విషాద గాథ..

Nirma : ‘నిర్మా’వాషింగ్ పౌడర్ యాడ్ లో తెల్లగౌను పాప గురించి షాకింగ్ విషయాలు..పేరు వెనుక పెను విషాదం

Nirma Washing Powder

Heart Touching Story Behind Nirma Washing Powder Bran : ‘వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా..పాలలోను తెలుపు నిర్మాతో వచ్చింది..రంగుల బట్టలే తళతళగా మెరిసాయి’..అనే యాడ్ లో తెల్లటి గౌను వేసుకుని..గుండ్రంగా తిరిగే చిన్నపాప యాడ్ ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇప్పటికే నిర్మా వాషింగ్ పౌడర్ కు అదే యాడ్.అదే తెల్లగౌను పాప. ఈ పాప ఎవరు? ఆమె ఇప్పుడు ఎలా ఉంది? ఆ పాప పేరు ఏమిటి?అనే ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పాప ఈ యాడ్ లో కనిపించిన పాప..నిర్మా పేరు వెనుక ఉన్న కథ..ఆ కథలో పెను విషాదం గురించి మీకు తెలుసా? ఈ యాడ్ వెనుక..కూతురు జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నం..నిర్మా ఆవిర్భావం వెనుక ..ముద్దుల కూతురి జ్ఞాపకం రెండూ నెరవేరిన ఓ అద్భతమైన ఆవిర్భావం.. 40 వేల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దుకున్న అనితరసాధ్యమైన ప్రస్థానం గురించి తెలుసా? ఎన్నో బ్రాండ్ లను కూడా సవాల్ చేసి మార్కెట్ లో ‘నిర్మా’ వాషింగ్ పౌడర్ ప్రస్థానం గురించి తెలుసుకుని తీరాల్సిందే. వేలాదిమందికి ఉపాధి కల్పించిన ‘నిర్మా’ ప్రస్థానం వెనుక ఉన్న అనితరసాధ్యమైన కథనం..నిర్మా యాడ్ లో తెల్లగౌను చిన్నారి మరణం..యాడ్ రూపొందటానికి ఓ తండ్రి ఆలోచనా కథనం..

వాషింగ్ పౌడర్ నిర్మా’ యాడ్ లోని తెల్లగౌను చిన్నారి అసలు పేరు నిరుపమ.. ముద్దు పేరు నిర్మా అని పిలుచుకునేవారు ఆమె తండ్రి పేరు కర్సన్‌భాయ్‌ ఖోడిదాస్ పటేల్‌. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్‌ పౌడర్‌ తయారుచేసే చిన్నపాటి వ్యాపారం మంచి జీతం, చీకుచింత లేకుండా సాగిపోతున్న కుటుంబంలో పెద్ద కుదుపు. పెను విషాదం. కర్సన్‌భాయ్‌ పటేల్‌ గారాలపట్టి ‘నిర్మా యాడ్ లోని తెల్లగౌను చిన్నారి ‘నిర్మా’ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కన్న తండ్రికి కూతురిని దూరం చేసిందా ప్రమాదం. నిర్మా మరణంతో ఎంతగానో కృంగిపోయారు కర్సన్ భాయ్ పటేల్. నిరంతరం కూతురు నిర్మా ఆలోచనలే. రోజులు వారాలు గడిచినా చిన్నారి నిర్మా ముద్దుల మోము కళ్లనుంచి కదలటం లేదు. పప్పా పప్పా అంటూ పిలుస్తున్నట్లే ఉండేది. ఈ క్రమంలో తన చిట్టితల్లి పేరు ‘నిర్మా’ పేరు చిరస్థాయిగా నిలిచి పోవటానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. నలభై వేల కోట్ల విలువైన కంపెనీ స్థాపనకు పునాది రాయి అయ్యింది. 14వేలమందికి ఉపాధిని కల్పిస్తోంది.

రసాయన శాస్త్రంలో డిగ్రీ చేసిన తర్వాత గుజరాత్‌ రాష్ట్ర మైనింగ్‌శాఖలో ఉద్యోగిగా పనిచేశారు కర్సన్‌భాయ్‌ పటేల్‌ చేరాడు. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్‌కి మరికొన్ని కెమికల్స్‌ కలిపితే మాసిన బట్టలను తళతళ మెరిసేలా చేయగలిగే పౌడర్‌ ఆయన ఆలోచనల నుంచి రూపుదిద్దుకుంది. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్‌ పౌడర్‌ తయారీ చేపట్టారు కర్సన్‌భాయ్‌. ఎప్పుడూ పని పని పనీ. ఇంత బిజీలో కూడా ఖాళీ చేసుకుని తన చిట్టితల్లి నిరుపమ (నిర్మా)తో ఆటలపాటల్లో మునిగిపోయేవారాయన.అవే అతని లోకంగా ఉండేవి.

ఈక్రమంలో వారి సంతోషాన్ని చూసి విధి ఓర్వలేకపోయిందేమో. సంతోషంతో సాగిపోతున్న వారికుటుంబంలో విషాదం వచ్చిపడింది.ఓవైపు గవర్నమెంటు ఉద్యోగం, మరోవైపు కెమికల్‌ ఇంజనీరుగా సరికొత్త డిటర్జెంట్‌ పౌడర్‌ ఆవిష్కరణ, ముద్దులొలికే కూతురి ముద్దు మురిపాలతో సాగిపోతున్న కర్సన్‌భాయ్‌ జీవితంలో ఊహించని ఘటన ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు యాక్సిడెంట్‌లో చనిపోయింది. అంతే కర్సన్ భాయ్ కు జీవితం అంతా ఒక్కసారిగా చీకటి అయిపోయింది. దేనిమీదా ఆసక్తి లేదు.తినటం పడుకోవటం కూడా మర్చిపోయారు. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచవద మారిపోయింది.అంతా అయోమయం.

విషాదం నుంచి పుట్టిన ఆలోచన ‘నిర్మా’కు శ్రీకారం
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందన్న బాధ కర్సన్‌భాయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ ఏదోకటి చేసిన తన చిట్టితల్లి పేరు నిలిచిపోయేలా ఏదోకటి చేయాలని తపన పడేవారాయన. కూతరు ఆలోచనతోనే చివరకు తనను చుట్టుముట్టిన రెండు ఆలోచనలను ఏకం చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన డిటర్జెంట్‌ పౌడర్‌కి తన ముద్దుల కూతురు నిరుపమ ముద్దు పేరైన ‘నిర్మా’ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు కన్సన్ భాయ్.

ఉద్యోగానికి రాజీనామా..సైకిల్ పై నిర్మా పౌడర్ ప్యాకెట్లు అమ్మకం
తన చిట్టి తల్లి పేరుతో తయారు చేసిన నిర్మాను ఎలాగైనా అభివృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు కార్లలో తిరిగిన ఆయన సైకిల్‌ ఎక్కారు. ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్‌ని అమ్మేవారు. మారు మూల వీధుల్లోకి కూడా తిరిగి గడపగడపకూ నిర్మాను పరిచయం చేశారు. అప్పటి వరకు మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థకు చెందిన డిటర్జెంట్‌ పౌడర్‌లో మూడో వంతు ధరకే అంటే నిర్మా డిటర్జెంట్‌ పౌడర్‌ను కేజీ రూ.3 లకే (అప్పటి ధర) అమ్మడం ప్రారంభించాడు. ధర తక్కువగా ఉండటంతో మహిళలంతా నిర్మానే కొనేవారు.వాడకంలో నాణ్యత కూడా ఉండటంతో గుజరాత్‌లో నిర్మా బ్రాండ్‌ ఊహించని స్థాయికి ఎదిగింది.

80వ దశాబ్దంలో దూరదర్శన్‌ ప్రసారాలు దేశమంతటా విస్తరించటంతో దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు కర్సన్‌భాయ్‌. కర్సన్‌భాయ్‌ రూపొందించిన ‘‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మా.. వాషింగ్‌ పౌడర్‌ నిర్మా’’ అనే అడ్వర్‌టైజ్‌మెంట్‌ యావత్ దేశానికి చేరిపోయింది. ఉప్పెనలా భారతదేశాన్ని చుట్టేసింది. ఆ యాడ్ లో ‘‘పాలలోని తెలుపు నిర్మాతో వంచ్చింది’ అనే స్లోగన్‌ మహిళలకు ఇట్టే ఆకట్టేసుకుంది. చిన్న పిల్లలు ఈ జింగల్‌ ఎఫెక్ట్‌తో దేశంలోనే నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా మారిపోయింది నిర్మా వాషింగ్ పౌడర్. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల బడ్డెట్ లో ఉండటంతో ఆ ఇళ్లలో నిర్మానే ఉండేది.

కూతురిపై ప్రేమ..కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌ను డిజైన్‌ కు అంకురం..
నిర్మా అడ్వెర్‌టైజ్‌మెంట్‌ ఆ స్థాయిలో సక్సెస్‌ కావడానికి కారణం కూతురిపై కర్సన్‌భాయ్‌కి ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌ను డిజైన్‌ చేశాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ చిన్నారిపాపను గుండ్రంగా తిప్పించి.. ఈ స్టిల్‌ ఫ్రీజ్‌ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్‌ చేశాడు కర్సన్‌భాయ్‌. ఈ ప్లాన్‌ అత్యద్భుతంగా సెట్ అయిపోయింది నిర్మాకు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ కూడా ఎన్ని బ్రాండెడ్ వాషింగ్ పౌడర్లు ఉన్నా నిర్మా పేరు తెలియని వారు లేనంటే అతిశయోక్తి కాదు.తెల్లగౌను వేసుకున్న పాప బొమ్మ ఉన్న డిటెర్జెంట్‌ పౌడర్‌ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్‌ క్లిక్‌ అయ్యింది. అంత సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఈ నిర్మా. అలా 2004 నాటికల్లా దేశంలో నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా కొనసాగుతూ 8 లక్షల టన్నుల డిటర్జెంట్‌ పౌడర్‌ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తూ.. పరోక్షంగా లక్ష మందికి పైగా జీవనాధారమయ్యింది.

కూతురు గుర్తుగా..విద్యారంగంలో నిర్మా ఎంట్రీ..
నిర్మా బ్రాండ్‌ని దేశంలోనే నంబర్‌ వన్‌గా మార్చిన తర్వాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచటానికి కర్సన్‌భాయ్‌ పటేల్‌ విద్యారంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో 1995లో నిర్మా ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీ స్థాపించారు. దాన్ని 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు.ప్రముఖులను హైలెట్ చేసే ఫోర్బ్స్‌ మ్యాగజైన్ వివరాల ప్రకారం 2019లో రూ, 42,000 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఇండియా పరంగా 30వ స్థానంలోను.. ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్‌భాయ్‌ నిలవటం విశేషం. 2010లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం నిర్మా వ్యవహారాలను ఆయన కొడుకులు, కోడళ్లు నిర్వహిస్తున్నారు.