హే పెరుమాళ్ : కీర్తనలపై అర్చకుల రగడ.. దేవుడి ముందే తిట్లు, తోపులాటలు

చెన్నై కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పూతాళ్వార్ ఉత్సవం సందర్భంగా.. అర్చకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

  • Edited By: veegamteam , November 7, 2019 / 10:46 AM IST
హే పెరుమాళ్ : కీర్తనలపై అర్చకుల రగడ.. దేవుడి ముందే తిట్లు, తోపులాటలు

చెన్నై కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పూతాళ్వార్ ఉత్సవం సందర్భంగా.. అర్చకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

చెన్నై కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పూతాళ్వార్ ఉత్సవం సందర్భంగా.. అర్చకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆలయంలో స్వామివారిని కీర్తించే క్రమంలో రెండు వర్గాల‌ు దూషణలకు దిగారు. తెంకలై ఆయంగార్లు స్వామి వారిని స్తుతిస్తూ దివిటీ తీసుకెళ్తుండగా.. వడకలై అయ్యంగార్లు అడ్డుకున్నారు. స్వామి వారి ముందు అర్చకులు పరస్పరం తిట్ల దండకం అందుకోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు అర్చకులకు సర్ధి చెప్పేందుకు ఆలయ ఈవో దగ్గర పంచాయితీ పెట్టారు.

బుధవారం (నవంబర్ 6,2019) ఈ ఘటన జరిగింది. వైష్ణవ సంఘాలు వడకాలి, తెంకాలి అర్చకుల మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం కొన్ని రోజులుగా నడుస్తోందని పోలీసులు తెలిపారు. నలయిరా దివ్య ప్రబందం 1008 శ్లోకాలు కీర్తించాలని ఓ వర్గం.. వద్దని మరో వర్గం వాదించుకున్నాయి. ఆ వివాదం ముదిరి దేవుడి ముందే తిట్ల దండకం అందుకునే వరకు మ్యాటర్ వెళ్లింది. ఏ వర్గం నుంచి కూడా తమకు ఫిర్యాదు అందలేదని, దీంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

అర్చకుల మధ్య వివాదం తొలిసారి కాదు. గతంలోనూ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. మార్చిలో వైశాఖి ఉత్సవం సందర్భంగా జెండా ఎగురవేసే విషయంలో గొడవపడ్డారు. అర్చకుల తీరుపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలతో ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అర్చకులు మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవాలన్నారు.