చలి..చలి : ఢిల్లీలో భారీగా పొగమంచు..46 విమాన సర్వీసుల మళ్లింపు

  • Published By: madhu ,Published On : December 21, 2019 / 03:44 AM IST
చలి..చలి : ఢిల్లీలో భారీగా పొగమంచు..46 విమాన సర్వీసుల మళ్లింపు

దేశ రాజధానిని పొగమంచు కమ్మేస్తోంది. దట్టంగా అలుముకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి దాక..పొల్యూషన్‌తో సమస్యలు ఎదుర్కొన్న ప్రజలు..ఇప్పుడు పొగమంచుతో అల్లాడుతున్నారు. వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు.

దూరం నుంచి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. 2019, డిసెంబర్ 21వ తేదీ శనివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు కప్పేసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే 46 విమనా సర్వీసుల దారిని మళ్లించారు. శుక్రవారం రాత్రి 8.30గంటల నుంచే పొగమంచు అలుముకుంది. శనివారం ఉదయం కూడా అదే పరిస్థితి కంటిన్యూ అయ్యింది.

విమానాలు బయలుదేరే అనుకూలమైన పరిస్థితిలు కనిపించలేదు. దీనివల్ల విమానం టేకాఫ్, ల్యాండింగ్‌లకు అంతరాయం కలుగుతుండడంతో విమానాలను ఇతర విమానాశ్రాయాలకు దారి మళ్లించారు. మరోవైపు ఉత్తర భారతంలో చలి విపరీతంగా ఉంటోంది. ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు కారణంగా దాదాపు 760 ఫ్లైట్స్ ఆలస్యంగా తిరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా హిమపాతం కురుస్తోంది. శ్రీనగర్‌లో 2.6 డిగ్రీలు, లద్దాఖ్‌లో 16 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.