Heavy rains in Kerala: భారీ వర్షాలకు.. కేరళ విలవిల.. వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్లు, చెట్లు..!

కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. జల ప్రళయానికి ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలన్న తేడా లేకుండా.. వరదలకు దాదాపుగా అన్నీ కూలిపోతున్నాయి.

Heavy rains in Kerala: భారీ వర్షాలకు.. కేరళ విలవిల.. వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్లు, చెట్లు..!

Kerala

కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. జల ప్రళయానికి ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలన్న తేడా లేకుండా.. వరదలకు దాదాపుగా అన్నీ కూలిపోతున్నాయి. ప్రవాహానికి కొట్టుకొచ్చిన చెట్టు.. కొట్టాయంలో చూస్తుండగానే కూలిపోయిన ఓ ఇల్లు.. ఇలా వర్షాల ప్రభావాన్ని తెలియజేసే వీడియోలు.. వైరల్ అవుతున్నాయి. వర్షాలతో ఇప్పటికే కొండచరియలు విరిగిపడి 26 మంది చనిపోయారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. కొట్టాయం జిల్లా నుంచి 13.. ఇడుక్కి జిల్లా నుంచి 9 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇడుక్కి జిల్లాకు చెందిన ఇద్దరు.. వరదల్లో కొట్టుకుపోయారు.

అరేబియా సముద్రంలో.. లక్షద్వీప్ కు సమీపంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలోని పీరుమేడులో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కేరళ సీఎంఓ తెలిపింది. భారత ఆర్మీకి చెందిన 2 ప్రత్యేక బృందాలను.. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఇడుక్కి, కొట్టాయం, కొల్లాం, కానూర్, పాలక్కడ్ జిల్లాల పరిధిలో సహాయ చర్యల నిమిత్తం పంపించినట్టు ప్రకటించింది. మరో 2 బృందాలను కొట్టాయం, తిరువనంతపురంలో వర్ష ప్రభావిత ప్రాంతాలకు పంపించినట్టు వెల్లడించింది.

వర్షాల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో.. కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ పరిధిలోని తీర ప్రాంతాల్లో.. చేపల వేటను ఉన్నతాధికారులు నిషేధించారు. ఈ నెల 21 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు.. 4 లక్షల రూపాయల చొప్పున సహాయాన్ని అందిస్తామని కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్ తెలిపారు. మరోవైపు.. ప్రధాని మోదీ.. సీఎం పినరయికి ఫోన్ చేసి పరిస్థితిపై రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తీశారు. అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

Read More:

Heavy rains in Kerala: భారీ వర్షాలకు.. కేరళ కకావికలం