Maharashtra : వర్షాల దాటికి 138 మంది మృతి.. రూ.5 వేలకోట్ల నష్టం.. ఆహారం దొరక్క అవస్థలు

కుండపోత వర్షాలకు మహారాష్ట్ర తడిసి ముద్దవుతుంది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చాలా గ్రామాలు నీటమునిగాయి. గడిచిన 24 గంటల్లో వర్షాలు పడనప్పడికి గతంలో కురిసిన వర్షాలకు వరద నీరు జామ్ అయింది. దీంతో రాష్ట్రంలో లక్షమందికి పైగా నిరాశ్రయులయ్యారు. చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇల్లు మునిగిపోవడంతో ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించారు.

Maharashtra : వర్షాల దాటికి 138 మంది మృతి.. రూ.5 వేలకోట్ల నష్టం.. ఆహారం దొరక్క అవస్థలు

Maharashtra (3)

Maharashtra : కుండపోత వర్షాలకు మహారాష్ట్ర తడిసి ముద్దవుతుంది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చాలా గ్రామాలు నీటమునిగాయి. గడిచిన 24 గంటల్లో వర్షాలు పడనప్పడికి గతంలో కురిసిన వర్షాలకు వరద నీరు జామ్ అయింది. దీంతో రాష్ట్రంలో లక్షమందికి పైగా నిరాశ్రయులయ్యారు. చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇల్లు మునిగిపోవడంతో ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించారు.

ఇక వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి.. ఇల్లు కూలి 138 మంది మృతి చెందారు. వందలమంది తప్పిపోయారు. రహదారులు ధ్వంసమయ్యాయి. తీవ్ర నష్టం వాటిల్లింది. సాంగ్లీ జిల్లాలో పరిస్థితి అధ్వానంగా ఉంది. జిల్లాలో చాలా గ్రామాలు నీటమునిగాయి.. నదులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లారీలో క్యాబిన్ లోకి నీరు వచ్చిన దృశ్యాలను చూస్తే అర్ధమవుతుంది ఇక్కడ వర్షం ఏ రేంజ్ లో పడిందో.

ఇక చాలామంది ఇప్పటికి తమ ఇళ్లపైనే ఎక్కి కూర్చున్నారు.. ఆహారం తాగునీరు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అనేక గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి స్కూళ్ళు కాలేజీలలో ఉంచారు. వారికి ఆహారపదార్దాలు ప్రభుత్వం అందిస్తుంది. వర్షాల కారణంగా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. చిన్నపిల్లలకు పాలు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఉద్దవ్ పర్యటించారు. ప్రజల కష్టాలను కళ్లారాచూశారు. ఎన్డీఆర్ఎఫ్, తోపాటు రాష్ట్ర బలగాలను సహాయకచర్యల కోసం ఉపయోగిస్తున్నారు. మొత్తం 34 బృందాలు సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే వర్షపు నీటిలో ముసళ్ల రావడంతో ప్రజలు భయపడుతున్నారు. మెసళ్ళు రోడ్లపైకి వచ్చి సేదతీరుతున్నాయి. రాత్రి సమయంలో పాములు వస్తున్నాయి.

ఈ వర్షాల కారణంగా 5000 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత అంటువ్యాదులు ప్రబలే ప్రమాదం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా కేసులతో ఇబ్బంది పడుతున్న మహారాష్ట్రను అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి.

ఇక ఈ నేపథ్యంలోనే సీఎం ఉద్దవ్ ఠాక్రే కేంద్ర పెద్దలతో మాట్లాడారు. తక్షణ సహాయంగా 1000 కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షలు కేటాయించింది.