Weather : జాగ్రత్త, రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

దేశ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Weather  : జాగ్రత్త, రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain

Heavy To Very Heavy Rain : దేశ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దేశంలోని 13 రాష్ట్రాల్లో కుండపోత ఖాయమని వార్నింగ్‌ ఇచ్చింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Read More : Hyderabad : నగరంలో దంచికొట్టిన వాన

ఇక తెలంగాణకు మరో 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని TSDPS వెల్లడించింది. అయితే హైదరాబాద్‌పై వరుణుడి ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పేర్కొంది.మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరుస అల్పపీడనాల ప్రభావంతో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రం మొత్తం జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా  మారాయి.

Read More : Sunday Funday At Charminar : రేపటి నుంచి చార్మినార్ వద్ద సాయంత్రం పూట “సండే-ఫన్‌డే

కృష్ణా , గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.