Hero Motors: రూ.వెయ్యి కోట్ల బోగస్ ఖర్చులు లెక్కలో చూపని హీరో సంస్థ

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సుమారు రూ.1000 కోట్లను బోగస్ ఖర్చులుగా వినియోగించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

Hero Motors: రూ.వెయ్యి కోట్ల బోగస్ ఖర్చులు లెక్కలో చూపని హీరో సంస్థ

Hero

Hero Motors: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన ప్రొమోటర్లు, వాటాదారుల ఇల్లు, గెస్ట్ హౌస్ లు, కార్యాలయాల్లో ఇటీవల ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు రూ.1000 కోట్లను బోగస్ ఖర్చులుగా హీరో సంస్థ వినియోగించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈమేరకు దాడుల్లో పాల్గొన్న అధికారి నుంచి వివరాలు బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హీరో సంస్థకు చెందిన అన్ని రకాల కార్యకలాపాలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఢిల్లీ నగర శివారుల్లో రూ.100 కోట్ల విలువైన ఫార్మ్ హౌజ్ ను హీరో గ్రూప్ యజమాన్యం పూర్తిగా నగదు చెల్లించి కొనుగోలు చేసినట్లు తమ విచారణలో తేలిందని ఐటీశాఖ వెల్లడించింది.

Also read:CJI NV Ramana : తెలుగు రాష్ట్రాల నుంచి పద్మా పురస్కారాలు అందుకున్నవారిని సత్కరించిన సిజేఐ ఎన్ వి రమణ

మార్చి నెల మూడో వారంలో హీరో సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ సహా హీరో మోటోకార్ప్ ప్రమోటర్ల కార్యాలయాలు, నివాసాలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పూణేలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులకు హీరో సంస్థకు సంబందించిన అక్రమాలు తెలిసాయి. దీంతో సంస్థపై నిఘా ఉంచిన ఐటీ అధికారులు ఈమేరకు దాడులు నిర్వహించారు.

Also Read:Bank Holidays April 2022 : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. హాలిడేస్ లిస్ట్ ఇదే..

భారత్ లో 50 శాతం మార్కెట్ వాటాతో ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్..భారత్ సహా 40 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తుంది. సంస్థకు భారత్ లో ఆరు, కొలంబియాలో ఒకటి, బంగ్లాదేశ్ లో ఒకటి తయారీ ప్లాంట్ లు ఉన్నాయి. గత ఇరవై ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనదారుగా హీరో మోటోకార్ప్ కొనసాగుతూ వస్తుంది. కాగా హీరో మోటోకార్ప్ సంస్థపై ఆదాయపు పన్నుశాఖ దాడుల నేపథ్యంలో సంస్థ షేరు ధర 7 శాతం మేర పడిపోవడం గమనార్హం.

Also read:Rajastan Unsafe: మహిళలకు అస్సలు భద్రత లేని రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానం: జాతీయ మహిళా కమిషన్