Jaipur Airport: జైపూర్ ఎయిర్ పోర్టులో యువతి సూట్‌కేసులో రూ.15కోట్ల విలువైన హెరాయిన్

జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ మహిళ రెండు కేజీల బరువైన దాదాపు రూ.15కోట్ల విలువైన హెరాయిన్ తరలిస్తూ పట్టుబడింది. 33ఏళ్ల ఆ మహిళ ఎయిర్ అరేబియా విమానంలో షార్జా నుంచి వస్తున్నట్లు.

Jaipur Airport: జైపూర్ ఎయిర్ పోర్టులో యువతి సూట్‌కేసులో రూ.15కోట్ల విలువైన హెరాయిన్

Minors Arrested

Jaipur Airport: జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ మహిళ రెండు కేజీల బరువైన దాదాపు రూ.15కోట్ల విలువైన హెరాయిన్ తరలిస్తూ పట్టుబడింది. 33ఏళ్ల ఆ మహిళ ఎయిర్ అరేబియా విమానంలో షార్జా నుంచి వస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అక్కడి ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారుల సమాచారం మేరకు.. మహిళ తన వీసా అప్లికేషన్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆమెను పట్టించినట్లు తెలిసింది.

అదే నెంబర్ తో ఇద్దరు ఉగాండా మహిళా ప్యాసింజర్లు ఢిల్లీ ఎయిర్ పోర్టులో నవంబర్ 13న 12.9కేజీల హెరాయిన్ తో పట్టుబడ్డారు. దాని విలువ దాదాపు రూ.90కోట్ల వరకూ ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఆమెను అనుమానిస్తూ.. బ్యాగేజి చెక్ చేసిన అధికారులు ఖాళీ సూట్ కేసు చూసి ఎక్స్ రే ఎగ్జామినేషన్ కు పంపించారు. అందులో సాధారణంగా ఉండే బరువు కంటే అధిక బరువు కనిపించడంతో లోపలి పొరలను చెక్ చేశారు. అందులో రెండు పెద్ద ఎన్వలప్ లు ఉండటం చూసి షాక్ అయ్యారు. పౌడర్స్ తో ఉన్న ఎన్వలప్ లను డ్రగ్ డిటెక్షన్ కిట్ తో పరీక్ష చేసి హెరాయిన్ గా గుర్తించారు.

………………………………… : వామ్మో ఒమిక్రాన్.. ఒక్కరోజే 10వేల కేసులు నమోదు