Heroin Seized : ముంబైలో రూ.300 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

ముంబైలోని పోలీసులు భారీగా హెరాయిన ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల హెరాయన్ దాదాపు రూ.300ల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్‌ తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు ఈ భారీ హెరాయిన్ ను పట్టుకుని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

Heroin Seized : ముంబైలో రూ.300 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

Heroin Seized In Mumbai

Heroin seized in Mumbai : ముంబైలోని పోలీసులు భారీగా హెరాయిన ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల బరువు కలిగిన హెరాయన్ దాదాపు రూ.300ల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్‌ తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు ఈ భారీ హెరాయిన్ ను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని అధికారులు సీజ్‌ చేశారు. దీని విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఎక్కడ నుంచి ఎక్కడకు తరలిస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? ఎన్నాళ్లి నుంచి ఈ అక్రమాలు చేస్తున్నారు? అనే కోణాల్లో విచారిస్తున్నారు.కాగా..ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు 300 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే. వారి నుంచి ఐదు ఏకే-47 రైఫిల్స్‌, మందుగుండు సామగ్రిని తరలిస్తున్న శ్రీలంక పడవను సైతం స్వాధీనం చేసుకుంది.

సంవత్సర కాలంగా ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాలు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని నిఘాలు వేసిన వేరు వేరు మార్గాల్లో మాదకద్రవ్యాల రణాలు కొనసాగుతునే ఉన్నాయి. కాగా.. కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో అధికారులు బిజీగా ఉండగా.. అక్రమార్కులు మాదక ద్రవ్యాలను తరలింపులను యదేచ్ఛగా తరలించేస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమంగా రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను హై అలర్ట్‌ చేసామని సంబంధిత వర్గాలు తెలిపాయి.