Hester : కోవాగ్జిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్ తో హెస్టర్ చర్చలు

భారత్ బయోటెక్​తో టెక్నాలజీ బదిలీ చేయించుకుని కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి గుజరాత్​ ప్రభుత్వంతో జట్టుకట్టినట్లు హెస్టర్​ బయోసైన్సెస్ ఆదివారం​​ తెలిపింది.

Hester : కోవాగ్జిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్ తో హెస్టర్ చర్చలు

Bharat Biotech Hester

Hester భారత్ బయోటెక్​తో టెక్నాలజీ బదిలీ చేయించుకుని కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి గుజరాత్​ ప్రభుత్వంతో జట్టుకట్టినట్లు హెస్టర్​ బయోసైన్సెస్ ఆదివారం​​ తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తికి సాంకేతికత బదిలీ గురించి ఇప్పటికే భారత్​ బయోటెక్ సంస్థ​తో పలు మార్లు చర్చలు జరిపినట్లు అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే హెస్టర్​ బయోసైన్సెస్ తెలిపింది. పశువుల ఆరోగ్య సంరక్షణ రంగంలో హెస్టర్​ బయోసైన్సెస్​​ పేరు పొందిన సంస్థ. కోళ్లకు వాక్సిన్లను తయారీలో ఇది దేశంలోనే రెండో అతి పెద్ద సంస్థ.

హెస్టర్​ బయోసైన్సెస్​​ సీఈఓ, ఎండీ రాజీవ్​ గాంధీ ఆదివారం ఓ ప్రకటనలో..వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి భారత్​ బయోటెక్​, గుజరాత్​ ప్రభుత్వంతో కలిసి త్రికూటమిగా ఏర్పడ్డాం. హెస్టర్ ​లో మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడానికి భారత్​ బయోటెక్​తో చర్చలు జరుగుతున్నాయి. వీటి ఫలితాన్ని బట్టి తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయ అని తెలిపారు. కాగా, దేశంలో ఇప్పటివరకు మూడు రకాల వ్యాక్సిన్లు- కొవిషీల్డ్​, కొవాగ్జిన్​, స్పుత్నిక్​ వీలకు అనుమతులిచ్చారు. డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా టీకా ఉత్పత్తి పెంచాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.