హై అలర్ట్: ఆంధ్ర, కేరళల్లో భారీ వర్ష సూచన

హై అలర్ట్: ఆంధ్ర, కేరళల్లో భారీ వర్ష సూచన

AndhraPradesh‌:AndhraPradesh‌లో రాబోయే 24గంటల్లో భారీ వర్ష సూచన కనిపిస్తుంది. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) కోస్తా తీరం వెంబడి ఉరుములతో కూడిన వర్షం రానున్నట్లు తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కాకినాడ తీరం దాటింది. తూర్పు గోదావరిలోని కాకినాడకు అల్పపీడనం సమీపించే కొద్దీ వరదలు రావడం, పెద్ద మొత్తంలో డ్యామేజ్ అవడానికి కారణం అయ్యాయి. వర్షాల కారణంగా పలు సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

 



 

కేరళలో భారీ వర్ష హెచ్చరిక:
వాతావరణ శాఖ భారీ వర్ష సూచనతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు రానున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తిరువనంతపురం, కొల్లాం, పఠానమ్తిట్టా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అనౌన్స్ చేశారు. ‘కేరళలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ కేరళలోని చాలా ఇళ్లు డ్యామేజికి గురయ్యాయి. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు ఇళ్ల పై కప్పులు డ్యామేజి చేస్తున్నాయి’ అని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సీనియర్ అఫీషియల్ చెప్పుకొచ్చింది.