High Alert In Delhi : ఢిల్లీలో డ్రోన్ దాడులకు ఉగ్రసంస్థలు ప్లాన్!

ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు.

High Alert In Delhi : ఢిల్లీలో డ్రోన్ దాడులకు ఉగ్రసంస్థలు ప్లాన్!

Delhi (2)

High Alert In Delhi ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు. మరోవైపు, ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో భద్రతని కట్టుదిట్టం చేశారు.

స్వాత్వంత్ర్య దినోత్సవ సెలబ్రేషన్స్ కి కొద్ది రోజుల ముందు ఆగస్టు-5న( జమ్మూకశ్మీర్ కి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన రోజు)పాకిస్తాన్ కి చెందిన ఉగ్రసంస్థలు ..పేలు పదార్థాలతో నింపిన డ్రోన్ లతో ఢిల్లీలో దాడులు జరిపే అవకాశముందని భద్రతా సంస్థలు ఢిల్లీ పోలీసులని హెచ్చరించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఢిల్లీలో అలజడులు సృష్టించాలని ఉగ్రసంస్థలు కుట్రపన్నుతున్నట్లు భద్రతా సంస్థలు తెలిపాయి.

ఇటీవల జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలోని అన్ని జిల్లాలను అలర్ట్ లో ఉంచాలని మరియు డ్రోన్ ముప్పును మానిటర్ చేస్తుండాలని ఢిల్లీ పోలీస్ కమిషర్ బాలాజీ శ్రీవాత్సవ..డీసీపీ,జాయింట్ సీపీ మరియు ఇతర నిఘా విభాగాల అధికారులను ఆదేశించారు. డ్రోన్ ముప్పు నేపథ్యంలో ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎర్రకోట దగ్గర నాలుగు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. మొదటిసారిగా..డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులకు మరియు ఇతర భద్రతా సంస్థలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు.