గుజరాత్‌లో హై అలర్ట్: ఉగ్రదాడి జరగొచ్చని హెచ్చరిక

గుజరాత్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో ముష్కరులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో గుజరాత్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 04:29 AM IST
గుజరాత్‌లో హై అలర్ట్: ఉగ్రదాడి జరగొచ్చని హెచ్చరిక

గుజరాత్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో ముష్కరులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో గుజరాత్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు

గుజరాత్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో ముష్కరులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో గుజరాత్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నారు.

కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిన నేపథ్యంలో గుజరాత్‌లోనూ ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయనే సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్‌కు అందింది. గుజరాత్‌లోని ప్రముఖ ప్రాంతాలలో దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిసింది.

దీంతో వెంటనే వారు గుజరాత్ పోలీసులను అప్రమత్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, తీరప్రాంతం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ధార్మిక స్థలాలు, సినిమా హాళ్లు, జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రదాడులకు సంబంధించిన సమాచారం ఢిల్లీ పోలీసులకు కూడా లభ్యమైంది. కశ్మీర్ తర్వాత ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లను టెర్రరిస్టులు టార్గెట్ చేసుకున్నారని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది.