Bihar: నితీశ్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై స్టే విధించిన హైకోర్టు

ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది.

Bihar: నితీశ్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై స్టే విధించిన హైకోర్టు

Bihar: బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బీహార్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల ఆధారిత సర్వేను పాట్నా హైకోర్టు గురువారం నిలిపివేసింది. నిజానికి కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని నితీశ్ సహా బిహార్ పక్షాలన్నీ చాలాసార్లు కోరాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నితీశ్ ప్రభుత్వమే తమ రాష్ట్రంలో చేపట్టింది. జనవరి 7న అధికారికంగా ఈ గణన ప్రారంభమైంది. దీనికి ఒక్క బీజేపీ మినహా బిహార్‭లోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.

Wrestlers: మాకు వచ్చిన మెడల్స్ అన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తాం: రెజ్లర్లు

కులాల వారీగా ప్రజల ఆర్థిక, సమాజిక స్థితిని అంచనా వేసే ఇలాంటి సర్వేలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే పట్ల వస్తున్న వ్యతిరేకతపై నితీశ్ కుమార్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో వెనుకవడిన వర్గాల ప్రజలకు ఈ సర్వే ద్వారా మెరుగైన లబ్దిని అందించేందుకు ఉపయోగపడుతుందని, ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది.

Ponguleti Srinivas Reddy: బీజేపీలోకి ఖాయమా? పొంగులేటి ఇంటికి బీజేపీ చేరికల కమిటీ.. పసందైన విందు ..

నిరుపేద ప్రజల సంఖ్యతో పాటు, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలను గుర్తించి అమలు చేసేందుకు ఈ సర్వే దోహదపడుతుందని ఆయన అన్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రారంభించిన ఈ సర్వే రెండు భాగాలుగా సాగుతోంది. అయితే ఇప్పటికే ఒక సర్వే పూర్తైంది. మొదటి విడతలో జనవరి 7 నుంచి 21 తేదీ వరకు మధ్య కులాల సర్వే జరిగింది. ఇక రెండవ విడత సర్వే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నిర్వహించాలి. కానీ కొన్ని అభ్యంతరాలు, అడ్డంకుల నడుమ అది ఆగిపోయింది.