నోరు జారితే బెయిల్ రద్దు చేస్తాం : స్టాలిన్ కు కోర్టు వార్నింగ్

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో స్టాలిన్  వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తచేసిన హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 06:47 AM IST
నోరు జారితే బెయిల్ రద్దు చేస్తాం : స్టాలిన్ కు కోర్టు వార్నింగ్

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో స్టాలిన్  వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తచేసిన హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.

చెన్నై : డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో స్టాలిన్  వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తచేసిన హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. కొడనాడు ఎస్టేట్ హత్యల మిస్టరీపై స్టాలిన్ మాట్లాడకుండా ఉంటేనే అతనికి  బెయిల్ కొనసాగుతుందనీ..లేదంటే మాటలు జారితే బెయిల్ ను రద్దు చేస్తామని స్పష్టం చేస్తు వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో  కొడనాడు ఎస్టేట్ హత్యల మిస్టరీపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు కొడనాడులో  ఎస్టేట్ ఉంది. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో జయలలిత ఇక్కడి నుంచి కూడా పాలన సాగించేవారు. ఈ క్రమంలో ఆమె  మరణం తరువాత కొడనాడు ఎస్టేట్ లో 2018 ఏప్రిల్ 24న దొంగతనం జరిగిన సందర్భంలో దుండగులు సెక్యూరిటీ గార్డును కిరాతకంగా హత్య చేశారు.

ఈ హత్యను పళనిస్వామి(ప్రస్తుత సీఎం) చేయించారని స్టాలిన్ ఆరోపించారు. దీంతో సీఎం పళనిస్వామి దీన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం  స్టాలిన్ కొడనాడు ఎస్టేట్ పై వ్యాఖ్యలు చేయరాదనీ..ఈ కేసు విషయంలో ఆయనకు లభించిన బెయిన్ ను రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.
Read Also : లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు