ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు నిజం చేసే ప్రయత్నాలు : జమ్ముకశ్మీర్‌లో హైటెన్షన్‌

జమ్ముకశ్మీర్‌లో హెటెన్షన్‌ నెలకొంది. పాక్‌ ఉగ్రమూకలు భారీ దాడులకు ప్లాన్‌ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగం తర్వాత ఉగ్రమూకలు మరింత

  • Published By: veegamteam ,Published On : September 28, 2019 / 10:41 AM IST
ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు నిజం చేసే ప్రయత్నాలు : జమ్ముకశ్మీర్‌లో హైటెన్షన్‌

జమ్ముకశ్మీర్‌లో హెటెన్షన్‌ నెలకొంది. పాక్‌ ఉగ్రమూకలు భారీ దాడులకు ప్లాన్‌ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగం తర్వాత ఉగ్రమూకలు మరింత

జమ్ముకశ్మీర్‌లో హెటెన్షన్‌ నెలకొంది. పాక్‌ ఉగ్రమూకలు భారీ దాడులకు ప్లాన్‌ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగం తర్వాత ఉగ్రమూకలు మరింత రెచ్చిపోతున్నాయి. కశ్మీర్‌లో రక్తపాతం జరుగుతుందన్న ఇమ్రాన్‌ ఆరోపణలను నిజం చేసి అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరో పుల్వామా దాడి జరుగుతుందన్న ఇమ్రాన్‌ వార్నింగ్‌ను నిజం చేసేందుకు పాక్‌ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. రెండు చోట్ల వాహనాలను హైజాక్‌ చేసి దాడులకు ప్రయత్నించారు.

రామ్‌బన్‌ జిల్లాలో బటోత్‌-దోడా రహదారిపై ఓ కారును ఆపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే డ్రైవర్‌ అక్కడ్నుంచి పారిపోయి సైనిక స్థావరానికి సమాచారం ఇచ్చాడు. ఈలోపు ఓ బస్సును కూడా ఆపేందుకు ప్రయత్నించారు. వారు సైనిక దుస్తుల్లో ఉండటంతో మొదట బస్సు ఆపేందుకు ప్రయత్నించిన డ్రైవర్ తర్వాత అనుమానంతో ముందుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.

దీంతో ఉగ్రవాదులు వారిపైకి గ్రనేడ్లు విసిరారు. ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఐదుగురిని బందీలుగా తీసుకున్నారు. సైన్యం ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. వర్షం కారణంగా సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. వాహనాలను హైజాక్‌ చేసి పుల్వామా తరహా దాడికి ప్రయత్నిస్తున్నారు. గురేజ్‌ ప్రాంతంలోనూ ఓ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఓ ఉగ్రవాదిని సైన్యం కాల్చి చంపింది. అతడి దగ్గర భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటు శ్రీనగర్‌లో రద్దీగా ఉండే ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు.