Hizab Row: ‘ఎగ్జామ్ హాల్స్ లోకి హిజాబ్ ధరించి వస్తే ఊరుకోం’

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలుకావడానికి ఒక్క రోజు ముందు మరో కీలక ప్రకటన చేశారు విద్యా శాఖ మంత్రి. పరీక్షా కేంద్రాల్లోకి హిజాబ్ ధరించి వస్తే ఊరుకోబోమని..

Hizab Row: ‘ఎగ్జామ్ హాల్స్ లోకి హిజాబ్ ధరించి వస్తే ఊరుకోం’

Hizab Row

Hizab Row: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలుకావడానికి ఒక్క రోజు ముందు మరో కీలక ప్రకటన చేశారు విద్యా శాఖ మంత్రి. పరీక్షా కేంద్రాల్లోకి హిజాబ్ ధరించి వస్తే ఊరుకోమని కర్ణాటక మంత్రి బీసీ నగేశ్ వెల్లడించారు.

‘కర్ణాటక హైకోర్టు ఆదేశాల ప్రకారం.. హిజాబ్ తో సహా ఏ మతపరమైన దుస్తులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. క్యాంపస్ లోకి హిజాబ్ ధరించి రావొచ్చని వచ్చిన తర్వాత మాత్రం కచ్చితంగా హిజాబ్ తీసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి రావాలని’ సూచించారు.

రాష్ట్ర మైనారిటీ డిపార్ట్‌మెంట్ సైతం స్కూల్స్, కాలేజీల్లోకి హిజాబ్ అనుమతించొద్దని ఆదేశాలిచ్చింది. ‘కర్ణాటక విద్యా చట్టం, నిబంధనలు ప్రకారం.. విద్యార్థులు వారి మతపరమైన సెంటిమెంట్లను పక్కకుపెట్టి యూనిఫాం మాత్రమే ధరించాలి. డ్రెస్ కోడ్ ను ఉల్లంఘించి ఎటువంటి వస్త్రాధారణ ఉండదు’ అని ఆశిస్తున్నట్లు నగేశ్ పేర్కొన్నారు.

Read Also: హిజాబ్ ను విద్యాసంస్థల బయటే ధరించండి

‘గడగ్, హుబ్బలి, బగల్ కోట్‌కు చెందిన డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ తో మాట్లాడాం. హిజాబ్ ఎప్పుడూ వివాదాస్పద అంశం కాదని, పరీక్షలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. చాలా కాలంగా యూనిఫాంలు పంపిణీ చేయని పక్షంలో, విద్యార్థులు మతపరమైన భావాలను ప్రతిబింబించనంత వరకు తమకు నచ్చిన దుస్తులను ధరించవచ్చు. ఇది ప్రైవేట్ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది’’ అని నగేష్ వివరించారు.